భగవద్గీత-12
(ఐ)
ప్రశ్న.61..భగవత్ తత్త్వం ఎంతమందికి తెలుస్తుంది?
జవాబు..పూర్వ వాసనలు మనిషిని మంచి పనులు చేయనివ్వవు.చెట్టుకు పుట్టిన పిందెలన్నీ పండ్లు కావు..సాధకులు కూడా కొందరికి తెలుస్తుంది.
ప్రశ్న.62..కనిపించే ఈ వస్తువులు భగవంతుని కంటే గొప్పవా? కావా?
జవాబు..భగవంతుడి కంటే మించింది లేదు.ఈ వస్తువులన్నీ నిలబడాలన్నా,కనబడాలన్నా ఆయనే ఆధారం.
ప్రశ్న.63..ప్రపంచమంతా మాయ అంటారు..మాయ అంటే.?
జవాబు..సత్త్వం,రజస్సు,తమస్సు..అనే మూడు గుణాల రూపంలో ఈ మాయ వుంటుంది..భగవంతున్ని శరణు పొందితేనే అది దాటగలము.
ప్రశ్న..64..అందరు భగవంతుని చేతనే సృష్టించబడతారు కదా.మరి కొందరు దేవుడే లేడనే నాస్తికులు ఎందుకుంటారు.?
జవాబు...వారి పూర్వ జన్మ వాసనలని బట్టి,వివేకం శూన్యమై అధములుగా తయారు అవుతారు.
ప్రశ్న..65..భగవంతుణ్ణి ఎందరో పూజిస్తుంటారు..వీరంతా ఎవరు?
జవాబు..మంచి మార్గంలో నడిచి,లోకానికి ఆదర్శంగా వుండే సజ్జనులు దేవుణ్ణి ఆరాధిస్తారు.1.బాధలు పోవాలని కోరే ఆర్తులు.2.ఆత్మ తత్త్వాన్ని తెలుసుకోగోరే జిజ్ఞాసువులు.3.సంపదలను కోరే అర్థార్థులు.4.ప్రపంచమంతా వాసుదేవమయంగా భావించే జ్ఞానులు...
(భగవద్గీతలోని 7వ అధ్యాయంలో 3,7,14,15,16 శ్లోకాల ద్వారా శ్రీకృష్ణుడు అర్జునునికి బోధ చేస్తాడు).
- అప్పాల ప్రసాద్.
(భగవద్గీతలోని 7వ అధ్యాయంలో 3,7,14,15,16 శ్లోకాల ద్వారా శ్రీకృష్ణుడు అర్జునునికి బోధ చేస్తాడు).
ReplyDelete