Breaking News

భగవద్గీత-11


(ఏ)

ప్రశ్న.56.భగవంతుడు అందరినీ రక్షించడా? ఏవైనా అర్హతలు వుండాలా?

జవాబు..ఎవరైతే ప్రపంచంలోని జీవులందరినీ నాలో చూడగలరో వారికి ఎల్లప్పుడూ తాను అండగా వుంటానని భగవంతుడే చెప్పాడు.

ప్రశ్న.57..ఈ రోజుల్లో ఎంత చదివినా,ఎంత వయస్సు వచ్చినా అందరినీ సమానంగా చూడటం లేదు.మరి భగవంతుడికి ప్రియమైనవాడు ఎవరు?

జవాబు...తొటి జీవుల సుఖ దుఖాలన్నింటిల్లో తోడుగా వుండే వాడే భగవంతునికి ప్రీతిపాత్రుడు.

ప్రశ్న.58..ఎంత ప్రయత్నించినా మనస్సును కంట్రొల్ చేయటం కష్టంగా వుంది.

జవాబు..నిజమే..అది సహజంగా చంచలల్మైనది.నిరంతర అభ్యాసం ద్వారానే నిరోధించాలి.

ప్రశ్న..59.యోగాన్ని అభ్యాసం చేసినా ఫలితం రాలేదు.

జవాబు..మంచి భావనతో మంచిపని చేసేవాడికి లోకంలో దుర్గతి వుండదు.

ప్రశ్న..60..యోగాభ్యాసం చేసికూడా నిష్టతో లేనివాడు ఏమవుతాడు.?

జవాబు..యోగాన్ని అనుష్టించినా భోగవాసనలు వున్నాయి కాబట్టి,మళ్ళీ,మళ్ళీ జన్మలు ఎత్తవలసివస్తుంది.

(భగవద్గీతలోని 6వ అధ్యాయంలో 30,32,34.40,41 శ్లోకాల ద్వారా కృష్ణుడు అర్జునునికి బోధించారు).
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. (భగవద్గీతలోని 6వ అధ్యాయంలో 30,32,34.40,41 శ్లోకాల ద్వారా కృష్ణుడు అర్జునునికి బోధించారు).

    ReplyDelete