భగవద్గీత-9
(ఊ)
ఇంద్రియాలను ఎలా జయించాలి? యజ్ఞాలు అవసరమా?
ప్రశ్న.26..ఆలోచించి చేసే ఓపిక నాకు లేదు.ఓటమి చాలా సార్లు కలుగుతుంది.విజయం అప్పుడప్పుడు..నాకు శాంతి లేదు.నాకు తోస్తె చాలు ముందు వెనకా ఆలోచించను..అదీ పరిస్థితి..
జవాబు..నీలో సమబుద్ధి లేదు.పని ఎలా చేయాలో ఆ కౌశల్యం లేదు.ఫలితం ఎలా వచ్చినా సమానంగా స్వీకరించే స్థితి లేదు.అందుకే శాంతి లేదు.సమబుద్ధిని,పనిలో నైపుణ్యాన్ని అలవరచుకో.
ప్రశ్న..27.నేను స్థిరమైన నిర్ణయం చేసుకోలేకపోతున్నాను.చేసినా అమలు చేయ్లేకపోతున్నాను.
జవాబు...నీ ఇంద్రియాలు దాని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాయి.నీ మనసు వాటిని కంట్రోల్ చేయాలి కాని మనసు కూడా వాటికి లొంగిపోయింది.అందువల్లనే ఆ పరిస్థితి. అదుపులో పెట్టుకో.
ప్రశ్న..28.నేను పని చేయటం మానేసాను..అయినా ఎవరితోనో మాట్లాడుతునే వున్నాను.అదీ మానేసాను.బుర్రలో ఏవో ఆలోచనలు బయలుదేరాయి.నేను ఏదీ(పనులు,మాటలు,ఆలోచనలు) ఆపలేక పోతున్నాను..ఇదేమైన రోగమా?
జవాబు...ఇది రోగం కాదు..మానవ స్వభావం.ప్రకృతి ఒత్తిడితో ఏదో ఒక పని చేస్తూనే వుంటాడు.అందుకే ఎక్కువ కాలం దైవారాధన,మంచి సేవా కార్యాలు చేయటం అలవాటు చేసుకుంటే చెడ్డపనులు చేయవలసిన పరిస్థితి రాదు.
ప్రశ్న..29.ప్రజలను మారుద్దామని బయలుదేరాను..కాని సాధ్యం కాలేదు.పనులు చేయటమే మానేసాను.దాంతో సోమరినయ్యాను.జీవితమే నిరాశంగా వుంది.ఎలా?
జవాబు..ప్రపంచంలో మూడు రకాల మనుష్యులు వుంటారు.1.అకర్ములు.2.సకర్ములు.3.నిష్కామ కర్ములు....నీవు మొదటి తెగకు చెందినవాడివి..ఫలితం ఆశించకుండా ఏదో ఒక పని చెస్తూ పొతుండాలి. లేకపొతే జీవితం స్థంభించిపోతుంది.
ప్రశ్న.30..నా మిత్రుడొకడు అంటాడు కదా..కంటికి కనిపించని దేవతలను ఎందుకు ఆరాధించాలని ప్రశ్నిస్తాడు.యజ్ఞాలు,యాగాలు..ఇవన్నీ ముఢనమ్మకాలంటాడు.మనకు కనిపించింది ఏదైనా అనుభవిస్తే తప్పేమిటని అంటాడు.
జవాబు...అలా ప్రశ్నించేవారు మూర్ఖులు.యజ్ఞ యాగాదులద్వారా వర్షాలు వచ్చి,పాడిపంటలు కలుగుతున్నాయని సైన్స్ ప్రకారం కూడా ఋజువు అయింది.మనం పొందుతున్న పంటల్లో నుండి కొంత కృతజ్ఞతతో ఆ భగవంతునికి హవిస్సుల రూపంలో మళ్ళీ యజ్ఞం చేస్తే తప్పేమిటి? కేవలం మనమే స్వార్థంతో అనుభవిస్తే దొంగలం అవుతాము.ఇవ్వటం మానేసి,అనుభవించటం మొదలైంది కాబట్టే,కరువులు,ఉప్పెనలు,పంటలు పోవడాలు జరుగుతున్నాయి.
(భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 66,67,68, 3వ అధ్యాయంలోని 5,8,11,12 శ్లోకాల ద్వారా శ్రీ క్ర్ష్ణుడు అర్జునునికి హితవు చెపుతాడు.)
- అప్పాల ప్రసాద్.
(భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 66,67,68, 3వ అధ్యాయంలోని 5,8,11,12 శ్లోకాల ద్వారా శ్రీ క్ర్ష్ణుడు అర్జునునికి హితవు చెపుతాడు.)
ReplyDelete