Breaking News

భగవద్గీత-10


(ఎ)
ప్రశ్న..51..దేవునికి పక్షపాతం వుందా?నా పాపం పోగొట్టి,బాధలు ఎందుకు తీర్చడు?

జవాబు...నీవు అనన్యమైన భక్తితో ఆయనపై భారం వేస్తే ఆ బరువును స్వీకరిస్తాడు.కాకపోతే నీలో వున్న జ్ఞానం,అజ్ఞానం చేత ఆవరింపబడివున్నది కాబట్టి నీకు మోహం ఏర్పడింది.ఆయనకు ఎటివంటి పక్షపాతం లేదు.

ప్రశ్న..52..ప్రతి వ్యక్తిని గౌరవించాలని అందరూ అంటారు.ఇది కొత్తగా వచ్చిందా?

జవాబు..బ్రాహ్మణునిలో,గోవులో,ఏనుగులో,కుక్కలోనూ,కుక్కమాంసం తినేవానిలోనూ సమానమైన భావాన్ని చూసేవాడే నిజమైన పండితుడు.ఇది మన భారతీయ సంస్కృతి.

ప్రశ్న.53..నేను ఒక పని చేశాను. బాగా సంతోషపడ్డాను.ఇంకొక పని మొదలు పెట్టాను..అన్నీ ఆడ్డంకులే.కుంగిపోయాను. ఇది ఎలా?

జవాబు..ఇది నీ మనస్సు బలహీనత. ఫలితం ఎలా వున్నా సమభావంతో వుండాలి.

ప్రశ్న,54..నేను చిన్నప్పటినుండి కష్టపడ్డాను.ఏదో చదువుకుని ఉద్యోగం చేసి,ఆ తరువాత పెద్ద వ్యాపారాలు పెట్టి బాగా లాభాలు సంపాదించాను. ఉన్నట్టుండి ఇక అన్నీ నష్టాలే..ఇలా ఎందుకు?

జవాబు..నీ సంకల్పం తప్పు.సంపాదనే సర్వస్వమనుకున్నవు.లాభమొస్తే గర్వపడ్డావు.నష్టం రాగానే చింతిస్తున్నావు.భౌతిక సుఖాల కోసం పాకులాడొద్దు.

ప్రశ్న..55..నేను మిత్రులు,శత్రువులు,బందువులు,సాధువులు..ఇలా వీళ్ళందరి మధ్యలో ఎలా జీవించాలి?

జవాబు...వివేకం గలవాడికి అందరూ ఒకటే..ఎవరి విషయంలో రాగం , ద్వేషం వద్దు..

(భగవద్గీతలోని 5వ అధ్యాయం లోని 15,18,20,22, అలాగే 6వ అధ్యాయం లోని 9 శ్లోకాల ద్వారా కృష్ణుడు అర్జునునికి తెలియజేస్తాడు.)
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. (భగవద్గీతలోని 5వ అధ్యాయం లోని 15,18,20,22, అలాగే 6వ అధ్యాయం లోని 9 శ్లోకాల ద్వారా కృష్ణుడు అర్జునునికి తెలియజేస్తాడు.)

    ReplyDelete