Breaking News

భగవద్గీత-1


(అ.)
మానవులందరికి నిత్యజీవితంలో సంభవించే ప్రతిసమస్యకు జవాబులుంటాయి..పరిష్కారాలుంటాయి. అవి ఏవి?

1.ప్రశ్న.ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచి ఫలితం రావటం లేదు.ఏ పని చేయాలన్నా భయమేస్తుంది.ధైర్యం లేదు.నిరుత్సాహం వస్తుంది. ఏమి చేయాలి?

జవాబు..నీలో వుండే శక్తి నీవు తెలుసుకో..పిరికితనం వదలిపెట్టి,ఉత్సాహంతో దైవం మీద భారం వేసి పని చేయి.లక్ష్యం సాధిస్తావ్.

2.ప్రశ్న.నా మంచి మిత్రుడు చనిపోయాడు.మరిచిపోలేకపోతున్న.ఎమిటీ జీవితం?

జవాబు..బాల్యం వస్తుంది..పోతుంది.బాధపడతామా? నీవు యువకున్ని అని అనుకునేలోపుగా ముసలితనం వస్తుంది.బాధ వుంటుందా? చావు తప్పుతుందా? నీ మిత్రుడు వేరే వూరు వెళ్ళాడని అనుకుంటే చాలు..బాధ వుండదు..

3.ప్రశ్న..చనిపోయినవారు గుర్తొస్తున్నారు.బ్రతికున్నవారు సరిగ్గా లేరని బాధ..మానసికంగా క్రుంగిపోతున్నా..ఏమి చేయాలి?

జవాబు..ఇది కేవలం నీ మానసిక దౌర్బల్యం.లోకంలో ప్రతివాడు పుణ్యపాపాలు అనుభవిస్తాడు.నీవు బాధ పడినంత మాత్రాన వాళ్ళలో మార్పు రాదు.

4.ప్రశ్న..ఎండాకాలం అతివేడి.వర్షాకాలం లో అతివృష్టి.చలికాలం భరించలేకపొతున్నా.నా జీవనసరళి అన్నీ ఒడిదొడుకులు.ఎలా బయటపడాలి?

జవాబు...నీవు చెప్పినవన్ని పర్మనెంట్ గా వున్నవేవి? అన్నీ తాత్కాలికాలే కదా..నీ మనస్సు పైన వీటి ప్రభావం పడకుండా ఒపిక వహిస్తే వాటికవే దూరమవుతాయి.

5.ప్రశ్న..ఇలాంటి ప్రభావాలకు లోను కాని వారున్నారా?

జవాబు..ఎందుకు లేరు? వున్నారు.ఇవన్నీ లెక్క చేయనివారే ధీరులు.వీటికి లొంగిపొతే క్రుంగిపోతారు.అందుకే వారికి మోక్షం లభిస్తుంది.

( భగవద్గీత లోని 2వ అధ్యాయం లో 3,11,13,14,15 శ్లోకాల ద్వారా కృష్ణుడు అర్జునునికి బోధించిన అంశాలు)
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. ( భగవద్గీత లోని 2వ అధ్యాయం లో 3,11,13,14,15 శ్లోకాల ద్వారా కృష్ణుడు అర్జునునికి బోధించిన అంశాలు)

    ReplyDelete