Breaking News

ప్రథమ భారత ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ

జననం:నవంబర్ 14, 1889
మరణం: మే 27, 1964

జవహర్‌లాల్ నెహ్రూ,భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ - గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.

నవ భారత రూపశిల్పి
భారత దేశానికి మొట్టమొదటి, మరియు అందరికంటే ఎక్కువకాలం పనిచేసిన ప్రధాన మంత్రి . వీరి పదవీ కాలం 1947 నుండి 1964 వరకు సాగింది. భారత స్వాతంత్ర్య సంగ్రామ ప్రముఖ నాయకుడైన నెహ్రూ, స్వంతంత్ర భారతదేశ మొదటి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీచే ఎన్నుకోబడ్డారు.పిమ్మట 1952 లో భారతదేశ మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినపుడు ప్రధాని అయ్యారు. అలీనోద్యమ స్థాపకుల్లో ఒకరైన నెహ్రూ యుద్ధానంతర కాల అంతర్జాతీయ రాజకీయాలలో ముఖ్య వ్యక్తి. ఆయనను పండిట్ నెహ్రూ అని,("పండిట్",సంస్కృతం,"పండితుడు", గౌరవసూచకము )భారతదేశంలో పండిట్ జీ అని పిలిచేవారు.

భారత దేశంలో సంపన్న న్యాయవాది మరియు రాజకీయ వేత్త అయిన మోతిలాల్ నెహ్రూ కుమారుడైన నెహ్రూ, యువకునిగా ఉన్నప్పుడే భారత జాతీయ కాంగ్రెస్లో వామ పక్ష నాయకుడయ్యారు. బ్రిటిష్ సామ్రాజ్యంనుండి సంపూర్ణ స్వాతంత్ర్య సముపార్జనకు అనుకూలుడైన నెహ్రూ,మహాత్మా గాంధీ సలహాలతో , ప్రజాకర్షణ కలిగిన సంస్కరణ వాద నాయకుడిగా ఎదిగి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు దీర్ఘ కాలం కొనసాగిన భారత స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్యపాత్ర వహించి గాంధీగారి రాజకీయ వారసునిగా గుర్తించ బడ్డారు. జీవిత పర్యంతం స్వేచ్ఛా వాదిగా ఉన్న నెహ్రూ, పేద దేశాల దీర్ఘకాల ఆర్ధిక అభివృద్ధిసమస్యలు ఎదుర్కోవటానికి నిలకడతో కూడిన సామ్యవాదం మరియు ప్రభుత్వ రంగం అనుకూలమని భావించారు.

ఆగష్టు 15 1947 లో భారత దేశం స్వాతంత్ర్యం సంపాదించినపుడు న్యూఢిల్లీ లో స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసే గౌరవం దక్కిన ఏకైక భారతీయుడు నెహ్రూ. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, స్వేచ్ఛా వాద సుగుణాల పట్ల గుర్తింపుతో పాటు పేద మరియు అణగారిన వర్గాల పట్ల వ్యాకులత, నెహ్రూ తన విధానాలు రూపొందించటంలో దిశానిర్దేశం చేసి భారతదేశ సిద్ధాంతాలను నేటికి కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఇవి ఆయన సామ్యవాద మూలాలతో ప్రపంచాన్ని అవలోకనం చేసుకోవడాన్ని ప్రతిబింబిస్తాయి.ప్రధాన మంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుడైన నెహ్రూ, తన పార్టీ సభ్యుల ఆధిక్యత కలిగిన పార్లమెంటు ద్వారా హిందూ స్త్రీల దాస్య విముక్తికి మరియు సమానత్వ సాధనకు ఉద్దేశింపబడిన అనేక న్యాయ సంస్కరణలు ఆమోదింప చేసారు. ఈ సంస్కరణలలో వివాహ కనీస వయోపరిమితిని పన్నెండు నుండి పదిహేనుకు పెంచడం, మహిళలను వారి భర్తల నుండి విడాకులు పొంది, ఆస్తి వారసత్వాన్ని పొందేలా శక్తివంతం చేయడం, వినాశకరమైన వరకట్న విధానాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం ఉన్నాయి.ఆయన సుధీర్ఘ పదవీకాలం స్వతంత్ర భారత దేశ సంప్రదాయాలు, విధానాలు రూపొందించటంలో సాధనంగా ఉన్నది.ఆయనను కొన్ని సందర్భాలలో 'నవ భారత రూపశిల్పి'గా పేర్కొంటారు. ఆయన కుమార్తె, ఇందిరాగాంధీ, మరియు మనుమడు, రాజీవ్గాంధీ కూడా భారతదేశ ప్రధానమంత్రులుగా పనిచేసారు.

బాల్యం
నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదు నగరం నందు జన్మించాడు. స్వరూపరాణి, మోతీలాల్ నెహ్రూ దంపతులకు మొదటి సంతానం. వీరు కాశ్మీరుకు చెందిన సరస్వతి బ్రాహ్మణ కులమునకు చెందినవారు. న్యాయవాది ఉద్యోగ నిమిత్తము కుటుంబం అలహాబాదుకు వలస మార్చింది. మోతీలాల్ న్యాయవాదిగా బాగా రాణించి, తన కుటుంబానికి సకల సంపదలు సమకూర్చారు. నెహ్రూ మరియు అయన తోబుట్టువులు అనంద్ భవన్ అనబడు ఒక భవంతి నందు ఉంటూ, దుస్తుల విషయంలో హావాబావల వ్యక్తీకరణలో పాశ్చాత్య నాగరికులవలె మెలిగేవారు. వీరంతా హిందీ, సంస్కృతంతో పాటు ఆంగ్లము లో కూడ తర్ఫీదు ఇవ్వబడినారు. నెహ్రూ 15 సంవత్సరాల వయస్సులో ఇంగ్లాండు పయనమయ్యాడు. అంతకముందు విద్యాబ్యాసం అంతా ఇంటి వద్ద మరియు ప్రపంచవ్యాప్తంగా పేరోందిన పాఠశాలలందు జరిగినది. మొదట ఇంగ్లాండులో హారో పాఠశాలలో ఆ తరువాత ట్రినిటీ కళాశాలలో విద్యనభ్యసించాడు. "జొ" అను ముద్దు పేరు తో పిలిచేవారు.

==జీవిత చరిత్ర==
నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో, సంపన్న న్యాయవాది అయిన మోతిలాల్ నెహ్రూమరియు స్వరూప్ రాణిల ప్రధమసంతానంగా నెహ్రూ జన్మించారు నెహ్రూ కుటుంబం కాశ్మీరి బ్రాహ్మణ వంశానికి చెందినది.

ఏమైనప్పటికీ, ఈ కాలం తీవ్రమైన మతహింసకు ఆనవాలుగా ఉన్నది. ఈ హింస పంజాబ్ ప్రాంతం, ఢిల్లీ, బెంగాల్ మరియు భారత దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. శాంతిని పెంపొందించేందుకు , కోపోద్రిక్తులై, దిక్కుతోచక యున్న శరణార్ధులను శాంతింప చేసేందుకు, నెహ్రూ పాకిస్తానీ నాయకులతో కలిసి పర్యటనలు నిర్వహించారు.నెహ్రూ, మౌలానా ఆజాద్ మరియు ఇతర ముస్లింనాయకులతో కలిసి, ముస్లింలకు భద్రత కల్పించి, భారతదేశంలో ఉండేందుకు ప్రోత్సహించేలా చేసారు. ఈ కాలంలోని హింస నెహ్రూను తీవ్రంగా కలచి వేసి , కాల్పుల విరమణ ను పాటించేలా మరియు భారత-పాకిస్తాన్ యుద్ధం 1947, ఆపడానికి ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం వహించేలా చేసింది. మతవిద్వేషాలకు భయమునొంది హైదరాబాద్ రాష్ట్ర విలీనానికి మద్దతు ఇవ్వడానికి నెహ్రూ సంశయించారు.

స్వాతంత్రం వచ్చిన తరువాత సంవత్సరాలలో, తన బాగోగులు చూడడానికి మరియు వ్యక్తిగత వ్యవహారాల నిర్వహణకు, నెహ్రూ తరచుగా తన కుమార్తె పై ఆధార పడేవారు.ఆయన నాయకత్వంలో, 1952 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీని సాధించింది. ఇందిర, తన తండ్రి సంరక్షణకై ఆయన అధికారికనివాసం లోనికి మారారు. వాస్తవానికి ఇందిర నెహ్రూ సిబ్బందిలో ముఖ్యురాలిగా ఉంటూ ఆయన భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలలో నిరంతరం తోడుగా ఉన్నారు.

ఆర్ధిక విధానాలు
భారత ఆర్ధిక రంగానికి అనువుగా సవరించిన రాజ్య ప్రణాళిక మరియు నియంత్రణ విధానానికి నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు. నెహ్రూ, భారత ప్రణాళికా సంఘంన్ని నెలకొల్పి, 1951 లో మొదటి పంచ-వర్ష ప్రణాళికను రచించి, అందులో పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులను పొందుపరిచారు. వ్యాపార మరియు ఆదాయ పన్ను పెరుగుదలతో, నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో కీలక పరిశ్రమలైన మైనింగ్, విద్యుత్ మరియు భారీ పరిశ్రమలు, పౌర సేవలతో ప్రైవేటు రంగాన్ని అదుపులో వుంచే మిశ్రమ ఆర్ధిక విధానంను యోచించారు. నెహ్రూ భూపునఃపంపిణి విధానాన్ని అనుసరించడంతో పాటు నీటిపారుదలకు కాలువలు త్రవ్వించడం, ఆనకట్టలు కట్టించడం మరియు వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.కమ్యూనిటీ అభివృద్ది పధకాల కు దారి తీసే లక్ష్యంతో గ్రామీణ భారత సామర్ద్యాన్ని ఇనుమడించే వివిధ కుటీర పరిశ్రమలను విస్తరింపచేసారు.భారీ ఆనకట్టలను ('నెహ్రూ వీటిని భారత దేశ ఆధునిక దేవాలయాలు' అనేవారు ) ప్రోత్సహించడం, నీటిపారుదల సౌకర్యాల కల్పన మరియుజలవవిద్యుత్ ఉత్పత్తి తో పాటు, నెహ్రూ భారతదేశ అణుశక్తి కార్యక్రమాలను కూడా ప్రవేశ పెట్టారు.

నెహ్రూ పదవీకాలంలో అభివృద్ధి మరియు ఆహారోత్పత్తి పెరుగుదల జరిగినప్పటికీ, భారత దేశం తీవ్రమైన ఆహారపు కొరతను ఎదుర్కొంటూనే ఉంది.నెహ్రూ ఆర్ధిక విధానాలు , ఆర్ధిక విధాన ప్రకటన 1956 లో పొందుపరచబడి, విభిన్న ఉత్పాదక మరియు భారీ పరిశ్రమలను ప్రోత్సహించినప్పటికీ , దేశ ప్రణాళిక, నియంత్రణ మరియు క్రమబద్దీకరణలు ఉత్పాదకత, నాణ్యత మరియు లాభదాయకతలను బలహీన పరచాయి.భారతఆర్ధిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధిని సాధించినప్పటికీ, విస్తారమైన పేదరికం, దీర్ఘకాల నిరుద్యోగిత అనే అంటురోగాల బారిన ప్రజలు చిక్కుకున్నారు. నెహ్రూ ప్రజాదరణ చెక్కుచెదరక పోగా, ఆయన ప్రభుత్వం విస్తారమైన భారత గ్రామీణ ప్రజానీకానికి నీరు, విద్యుత్ సరఫరా, ఆరోగ్య రక్షణ, రహదారులు మరియు వ్యవస్థాపన సౌకర్యాలు కల్పించడంలో విజయవంతమయ్యింది.

విద్య మరియు సంఘ సంస్కరణ
భారత దేశ బాలలు మరియు యువకులు విద్యను అభ్యసించాలనే తీవ్రమయిన కోరికగల నెహ్రూ, భారతదేశ భవిష్యత్ అభివృద్ధికి అది అత్యవసరమని భావించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ మరియుఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ వంటి అనేక ఉన్నత విద్యా సంస్థలను ఆయన ప్రభుత్వం నెలకొల్పింది. భారత దేశ బాలలందరికీ నిర్బంధ, ఉచిత ప్రాధమిక విద్య అందించాలనే సంకల్పాన్ని నెహ్రూ తన పంచ-వర్ష ప్రణాళికలలో ప్రతిపాదించారు.దీని కోసం నెహ్రూ మూకుమ్మడి గ్రామ భర్తీ కార్యక్రమాలను మరియు వేలాది పాఠశాలల నిర్మాణాన్ని పర్యవేక్షించారు.అంతేకాక బాలలలో పోషకాహార లోప నివారణకై ఉచిత పాలు మరియు ఆహార సరఫరా ప్రారంభించడానికి చొరవ తీసుకున్నారు. వయోజనుల కొరకు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల వారికోసం, వయోజన విద్యా కేంద్రాలు, వృత్తి మరియు సాంకేతిక విద్యా పాఠశాలలు కూడా నిర్వహించారు.

కుల వివక్షను శిక్షార్హమైన నేరంగా పరిగణించుటకు మరియు స్త్రీల యొక్క న్యాయ పరమైన హక్కులను మరియు సాంఘిక స్వతంత్రతకు, హిందూ చట్టంలో పలు మార్పులను నెహ్రూ ఆధ్వర్యంలోని భారత పార్లమెంటు చేసింది. షెడ్యుల్డ్ కులాలు మరియు తెగల ప్రజలు ఎదుర్కొంటున్న సాంఘిక అసమానతలను మరియు అననుకూలతలను రూపుమాపడానికి ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో రిజర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. నెహ్రూ లౌకికవాదానికి, మత సామరస్యానికి మరియు ప్రభుత్వంలో అల్ప సంఖ్యాక వర్గాల ప్రాతినిధ్యానికి పూనుకున్నారు.

జాతీయ భద్రత మరియు విదేశాంగ విధానం
ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రాన్ని పొందిన నూతన స్వేచ్ఛా భారతానికి నెహ్రూ 1947 నుండి 1964 వరకు నాయకత్వం వహించారు. యు.ఎస్. మరియు యు.ఎస్.ఎస్.ఆర్. లు ప్రచ్చన్న యుద్ధ కాలంలో భారత దేశాన్ని తమ మిత్ర దేశంగా చేసుకోవడానికి పోటీ పడ్డాయి.

1948 లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జనాభిప్రాయ సేకరణ కు నెహ్రూ అంగీకరించినప్పటికీ, తరువాతి కాలంలో ఐక్యరాజ్యసమితికి దూరమై 1953 లో జనాభిప్రాయ సేకరణకు నిరాకరించారు. అంతకుముందు తాను బలపరచిన షేక్ అబ్దుల్లా, వేర్పాటు వాద ఆశయాన్ని కలిగి ఉన్నారనే అనుమానంతో ఆయన అరెస్టుకు ఆదేశించి, ఆయన స్థానంలో బక్షి గులాం మొహమ్మద్ను నియమించారు. అంతర్జాతీయ రంగంలో నెహ్రూ ఒక శాంతి కాముక నాయకునిగా ఉండి ఐక్యరాజ్యసమితికి మంచి మద్దతుదారుగా నిలిచారు. ఆయన అలీన విధానాన్ని ప్రతిపాదించి, యు.ఎస్.మరియు యు.ఎస్.ఎస్.ఆర్. దేశాల నాయకత్వంలో ఉన్న వ్యతిరేక కూటముల మధ్య, తటస్థ వైఖరి అవలంబించే దేశాలతో అలీనోద్యమాన్ని స్థాపించి, దాని మూలధన ఏర్పాటుకు సహకారం అందించారు. స్థాపించిన వెంటనే పీపుల్స్ రిపబ్లిక్ అఫ్ చైనాను గుర్తించి(అనేక పశ్చిమ కూటములు రిపబ్లిక్ అఫ్ చైనా తో సంబంధాలు కొనసాగించాయి), ఐక్యరాజ్య సమితిలో దానిని చేర్చు కోవాలని వాదించి, కొరియాతో వైరం వల్ల చైనీయులను కలహ కారకులుగా గుర్తించడాన్ని వ్యతిరేకించారు. చైనా 1950 లో టిబెట్ ను ఆక్రమించినప్పటికీ దానితో సుహృద్భావ మరియు స్నేహపూర్వక సంబంధాలను నెలకొల్పాలని భావించి , కమ్యూనిస్ట్ దేశాలకు మరియు పశ్చిమ కూటమికి మధ్య ఏర్పడిన ఒత్తిడులను తొలగించేందుకు మధ్యవర్తిగా ఉండాలని ఆశించారు. చైనా తో ఈ విధమైన శాంతి కాముక విధానం సమస్యాత్మకమైనదిగా,చైనా కాశ్మీర్ ప్రాంతంలో నున్న, టిబెట్ సరిహద్దుగా ఉన్న అక్సాయి చిన్ ను ఆక్రమించి, భారత-చైనా యుద్ధం, 1962 కు దారి తీసినపుడు ఋజువైనది.

అణు ఆయుధాల బెదిరింపులను మరియు ప్రపంచంవ్యాప్త వత్తిడులను తగ్గించడానికి నెహ్రూ కృషి పలువురి ప్రశంసలు అందుకుంది. అణు విస్ఫోటనం వల్ల మానవ జాతికి కలిగే ఫలితాల తొలి అధ్యయనాన్ని ప్రారంభించి, తాను'వినాశకర భయానక యంత్రాలు'గా పిలిచే , వాటి నిరోధానికి నిరంతరం దండెత్తారు. అణు అస్త్రాల పోటి వల్ల దారితీసే అతి-సైనికీకరణ అభివృద్ధి చెండుతున్న దేశాలైన, తన దేశం వంటివి భరించలేనిదిగా భావించడం, ఆయన అణునిరాయుధీకరణకు వ్యతిరేకంగా ఉండడానికి కారణం.

1956 లో సుఎజ్ కాలువపై ఆంగ్లేయ, ఫ్రెంచ్ మరియుఇజ్రాయిల్ ల ఉమ్మడి దండయాత్రను విమర్శించారు. అనుమానం మరియు అపనమ్మకము యు.ఎస్., మరియు భారత దేశాల మధ్య సంబంధాలను బలహీనపరచి, నెహ్రూ వ్యూహాత్మకంగా సోవియట్ యూనియన్ను బలపరుస్తున్నారనే అనుమానాన్ని కలిగించింది.1960 లో పాకిస్తాన్ పాలకుడైన ఆయుబ్ ఖాన్ తో సింధు నదీ జలాల ఒప్పందం పై సంతకం చేయడం ద్వారా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పంజాబ్ ప్రాంతంలోని నదీ వనరుల పంపక సమస్య సాధనకు, యునైటెడ్ కింగ్డం మరియు ప్రపంచ బ్యాంక్ల మధ్యవర్తిత్వానికి అంగీకరించారు.

ఆఖరి సంవత్సరాలు
1957 ఎన్నికలలో నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ గొప్ప విజయాన్ని సాధించిన్పటికీ , ఆయన ప్రభుత్వం వెల్లువెత్తుతున్న విమర్శలను ఎదుర్కొంది . పార్టీ లోఅంతర్గతం గా ఉన్న అవినీతి అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయిన నెహ్రూ, పదవికి రాజీనామా చేసి, సేవను కొనసాగించాలని భావించారు.1959లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆయన కుమార్తె ఇందిరా గాంధీ ఎన్నిక బంధు ప్రీతి[ఆధారం కోరబడినది] విమర్శలను రేకెత్తించింది , నెహ్రూ ఆమె ఎన్నికను ఆమోదించక , వంశానికి అపకీర్తిగా భావించి, దానిని పూర్తిగా అప్రజాస్వామికము మరియు అవాన్చనీయం గా భావించారు , తన మంత్రివర్గంలో స్థానాన్ని తిరస్కరించారు . ఇందిరా గాంధీ తన తండ్రి విధానంతో విభేదించారు; ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో ఉన్న వ్యక్తిగత విభేదాలను ఉపయోగించుకొని , ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా కేరళ లోని కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియాప్రభుత్వాన్ని రద్దు చేయించారు. నెహ్రూ ఆమె దయలేని విధానాలు మరియు పార్లమెంటరీ సాంప్రదాయం పట్ల అగౌరవానికి తీవ్రంగా కలత చెందారు , ఆమె తండ్రిచాటు బిడ్డగా కాక, అకారణంగా నిర్దిష్ట చర్యలు తీసుకొనుట ఆయనను బాధించింది.

పంచ - శీల(శాంతియుత సహజీవనానికి ఐదు సూత్రాలు)టిబెట్ పై భారత-చైనా ఒప్పందం 1954కు ఆధారం ఐనప్పటికీ ,తరువాతి సంవత్సరాలలో సరిహద్దు వివాదాలు మరియు దలై లామా కు రాజకీయ ఆశ్రయం ఇవ్వాలనే నెహ్రూ నిర్ణయం చైనాతో పెరుగుతున్న విభేదాలు నెహ్రూ విదేశాంగ విధానానికి ఇబ్బంది కలిగించాయి.అనేక సంవత్సరాల చర్చలు విఫలమైన తరువాత, నెహ్రూ 1961 లో పోర్చుగల్ నుండి గోవాను స్వాధీన పరచుకోవలసినదిగా భారతీయ సైన్యాన్ని ఆజ్ఞాపించారు. చూడుము గోవా విముక్తి. సైనిక చర్య జరిపించినందుకు నెహ్రూ ప్రజాదరణతో పాటువిమర్శలను కూడా ఎదుర్కొన్నారు.

1962 ఎన్నికలలో, ఆధిక్యత తగ్గినప్పటికీ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రతిపక్ష పార్టీలైన, సాంప్రదాయ వాద పార్టీలు భారతీయ జన సంఘ్ మరియు స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్లుమరియుకమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియాలు కూడా గెలుపొందాయి.

కొద్దినెలల కాలంలోనే,సరిహద్దు వివాదాలను చైనా బహిరంగ యుద్ధాలుగా మార్చింది.సామ్రాజ్యవాద బాధితులుగా (భారత దేశం ఒక వలస రాజ్యం)మనం ఐకమత్యంగా ఉండాలని భావించి, "హిందీ-చీనీ భాయి భాయి ", (భారతీయులు మరియు చైనీయులు సోదరులు)అనే మాటలలో నెహ్రూ తన భావాన్ని వ్యక్తం చేసారు.అభివృద్ధి చెందుతున్న దేశాలమధ్య సోదర భావం మరియు ఐకమత్యానికి ఆయన అంకితం అయ్యారు. నెహ్రూ స్వాభావికంగా ఒక సామ్యవాద దేశం మరొక సామ్యవాద దేశం పై పోరుసల్పదని భావించారు, ఏ సందర్భంలో నైనా భారతదేశం చొరబడలేని మంచు గోడలైన హిమాలయాల వెనుక సురక్షితమని భావించారు. చైనా ఉద్దేశాలు, సైనిక సామర్ధ్యాల ముందు రెండూ కూడా తప్పని తేలాయి.చైనా ఆక్రమించుకున్న వివాదాస్పద ప్రాంతాల్లో వారిని ఎదుర్కోవాలనే ఆలోచనను - "వారిని (చైనీయులను )బయటకు విసిరేయండి"-అనే జ్ఞప్తికి ఉంచుకోదగిన ప్రకటనలో సైన్యాన్ని ఆదేశించారు-చైనా ముందస్తు దాడిని ప్రారంభించింది.

చైనా భారత యుద్ధం ప్రారంభించిన కొద్ది రోజులలోనే చైనా సైన్యం ఈశాన్య భారత దేశంలోనిఅస్సాం వరకు చొచ్చుకు రావడం భారత సైన్య బలహీనతను బహిర్గత పరచింది.భద్రతపై అయన ప్రభుత్వ నిర్లక్ష్యానికి తీవ్ర విమర్శలు ఎదుర్కొని,రక్షణ మంత్రి అయిన కృష్ణ మీనన్ను తొలగించి, యు.ఎస్. సైనికసహాయం అర్దించవలసి వచ్చింది. క్రమంగా నెహ్రూ ఆరోగ్యం మందగించ సాగింది, కోలుకోవడానికి అయన 1963 లో కొన్ని నెలలు కాశ్మీర్లో గడపవలసి వచ్చింది. కొంతమంది చరిత్ర కారులు ఈ ఆకస్మిక ఇబ్బందికి కారణం చైనా దండయాత్ర వలన అయన పొందిన అవమానం మరియు విశ్వాస ఘాతుకంగా భావిస్తారు]కాశ్మీర్ నుండి తిరిగి వచ్చిన తరువాత నెహ్రూ గుండెపోటుతో బాధపడి తరువాత మరణించారు. 27 మే 1964 వేకువ సమయంలో ఆయన మరణించారు. హిందూమత కర్మల ననుసరించి యమునా నది ఒడ్డున గలశాంతివన్లో నెహ్రూ అంత్య క్రియలు జరుప బడ్డాయి, వందల వేల మంది సంతాపం ప్రకటించడానికి ఢిల్లీ వీధులలో మరియు అంత్యక్రియా స్థలం వద్ద గుమికూడారు.

వారసత్వం
భారత దేశ మొదటి ప్రధానమంత్రి మరియు విదేశాంగమంత్రిగా,జవహర్లాల్ నెహ్రూ నవ భారత ప్రభుత్వ విధానాలను, రాజకీయ సంస్కృతిని మరియు శక్తివంతమైన విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ముఖ్య పాత్ర వహించారు.సార్వత్రిక ప్రాధమిక విద్యా పధకాన్ని ప్రారంభించి, దేశంలోని మారుమూల గ్రామీణ బాలలకు విద్య అందించ గలిగినందుకు అయన ప్రశంశించబడతారు.ప్రపంచ స్థాయి విద్యా సంస్థలైన అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, మరియుఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ లు అభివృద్ధి చేసిన ఘనత నెహ్రూ విద్యా విధానానిదే.

భారతదేశ ప్రత్యేక జాతుల, అల్ప సంఖ్యాక వర్గాల, స్త్రీల, షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యుల్డ్ తెగల కు సమాన అవకాశాలు మరియు హక్కులు కల్పించేందుకు విస్తృతమైన విధానాన్ని రూపొందించి స్థిరమైన చర్యలను నెహ్రూ చేపట్టారు.సమానత్వాన్ని నెలకొల్పాలనే నెహ్రూ ఆకాంక్ష , ఆయన స్త్రీలు మరియు అణగారిన వర్గాల కొరకు ప్రభుత్వ పధకాలు విస్తృతంగా రూపొందించి, వాటి అమలుకు ప్రయత్నించేలా చేసింది,కాని అవి ఆయన జీవిత కాలంలో పరిమితంగానే విజయవంతమయ్యాయి.

ఓటమి ఎరుగని జాతీయ వాదిగా నెహ్రూ స్థానం ఆయన,ప్రాంతీయ భేదాలను గుర్తిస్తూ నే అణచి వేయబడిన సామాజిక వర్గాల కొరకు విధానాలు అమలు పరచుటకు దారి చూపింది. స్వాతంత్ర -అనంతర కాలంలో ఆంగ్లేయులు ఉపఖండం నుండి విరమించు కొన్న తరువాత ,ఉపఖండంలో అంతకు ముందు ఒకే సామాన్య విరోధి కి వ్యతిరేకంగా మిత్రులుగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఇక నుండి ఒకరికొకరు సంబంధం లేకుండా విభేదాలు పొడసూపిన కాలంలో ఇది ప్రాముఖ్యతను సంతరించు కుంది.సాంస్కృతిక వైవిద్యం ప్రత్యేకించి భాషా వైవిద్యం దేశ ఐక్యతను భంగపరచేదిగా ఉన్న సమయంలో, నెహ్రూ నేషనల్ బుక్ ట్రస్ట్ మరియు నేషనల్ లిటరసీ అకాడమీ వంటి సంస్థలను ఏర్పరచి వివిధ భాషల మధ్య అనువాదాలను ప్రోత్సహించారు మరియు విషయ పరిజ్ఞాన బదిలీలను ప్రోత్సహించారు.సమైక్య భారతదేశం కోసం నెహ్రూ "కలసిఉండడం లేదా నశించడం ", అని నినదించారు.

జ్ఞాపకార్ధం
తన జీవిత కాలంలో నెహ్రూ భారత దేశంలో ఒక ఆదర్శ మూర్తిగా గుర్తింపబడి , ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆదర్శవాదము మరియు రాజకీయ ధురన్ధరత ప్రశంసించ బడ్డాయి.బాలల మరియు యువజనుల పట్ల నెహ్రూకు గల వాత్సల్యానికి, వారి శ్రేయస్సుకు , విద్యాభివృద్ధికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా, ఆయన జన్మ దినమైన 14 నవంబర్, ను భారత దేశం బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నది. దేశ వ్యాప్తంగా బాలలు ఆయనను చాచా నెహ్రూ (నెహ్రూ అంకుల్)అని గౌరవిస్తారు. కాంగ్రెస్ పార్టికి చెందిన ప్రజాదరణ పొందిన నాయకునిగా ఆయనను తరచూ వారు గుర్తు చేసుకుంటారు.కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ఆయన వస్త్ర ధారణను, ప్రత్యేకించిగాంధీ టోపీ ని మరియు అలవాట్లను అనుకరిస్తుంటారు. నెహ్రూ ఆదర్శాలు మరియు విధానాలు కాంగ్రెస్ ప్రకటన పత్రము (ముసాయిదా)ను మరియు మూల రాజకీయ తత్వాన్ని రూపొందించడంలో నేటికీ ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆయన వారసత్వ ప్రతినిధిగా ఇదిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రభుత్వ నాయకత్వాన్ని చేపట్టారు.

నెహ్రూ జీవితం పై ఎన్నోడాక్యుమెంటరీలు నిర్మింపబడ్డాయి.ఎన్నో కల్పిత చిత్రాలలో ఆయన చిత్రీకరింప బడ్డారు. 1982 లో రిచర్డ్ అటెన్ బరో చిత్రంగాంధీ లోను, నెహ్రూ చే రచింపబడిన ది డిస్కవరీ అఫ్ ఇండియా గ్రంధం పై ఆధారపడి 1988 లోశ్యాం బెనెగల్ యొక్క టెలివిజన్ సీరియల్ భారత్ ఏక్ ఖోజ్ లోను , 2007 లో ది లాస్ట్ డేస్ అఫ్ ది రాజ్ అనే టెలివిజన్ చిత్రం లోను మూడు సార్లు నెహ్రూ పాత్రను పోషించినరోషన్ సేథ్ ఆ పాత్రకు పరిపూర్ణత నిచ్చారు. కేతన్ మెహతా చిత్రం సర్దార్ లో నెహ్రూపాత్రను బెంజమిన్ గిలానీ పోషించారు.

శేర్వాని ధారణను నెహ్రూ వ్యక్తి గతంగా ఇష్ట పడడం దానిని ఉత్తర భారత దేశంలో నేటికి కూడా ప్రత్యేక సందర్భ వస్త్ర ధారణగా నిలిపింది. ఒక రకమైన టోపీకి ఆయన పేరును ఇవ్వడం తో పాటు, ఆయన ప్రాధాన్యతనిచ్చిన కోటుకు కూడానెహ్రూ కోటు అనే పేరునిచ్చి గౌరవిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా అనేక ప్రభుత్వరంగసంస్థలు, జ్ఞాపక చిహ్నాలు నెహ్రూస్మృతికి అంకితం ఇవ్వబడ్డాయి. భారత దేశంలోని విశ్వవిద్యాలయాలలో ఢిల్లీ లోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ముంబై నగరానికి దగ్గరలో నున్న జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ భారీ సరుకు రవాణాకు, రాకపోకలకు అనువుగా నిర్మించ బడిన ఆధునికమైన పోర్ట్ మరియుడాక్. ఢిల్లీ లోని నెహ్రూ నివాసము నెహ్రూ జ్ఞాపకార్ధ మ్యూజియం మరియు గ్రంధాలయంగా సంరక్షించ బడుతోంది. నెహ్రూ కుటంబ భవనాలైన ఆనంద్ భవన్ మరియు స్వరాజ్ భవన్ లు నెహ్రూ జ్ఞాపకార్ధం మరియు కుటుంబ వారసత్వంగా కాపాడబడుతున్నాయి. 1951 లో ఆయన అమెరికన్ ఫ్రెండ్స్ సర్వీసు కమిటీ (AFSC)ద్వారానోబెల్ శాంతి బహుమతి కి ప్రతిపాదించ బడ్డారు.
నోన్గ్పో లో పిల్లలకు మిఠాయిలు పంచుతున్న నెహ్రూ

జవహర్‌లాల్ నెహ్రూ, హైదరాబాదు అబిడ్స్ దగ్గరి విగ్రహము

మూలం: వికీపీడియా.

1 comment:

  1. ప్రథమ భారత ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ.

    ReplyDelete