Breaking News

బాలల పర్వదినం-నెహ్రూ జన్మదినం


నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవిత వ్యం వారిమీదే ఆధారపడి వుంది. వాళ్ళు సక్ర మమైన దారిలో నడిస్తేనే దేశానికి మంచి పేరు ప్రతి ష్టలూ, కీర్తి లభిస్తాయి. అలా కాకుండా వారు పెడ తోవ పడితే దేశ భవితవ్యం నాశనమై పోతుంది. ఈ విషయాన్ని చక్కగా గుర్తించారు నెహ్రూ.

నేటి బాలలను సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత, ఆవశ్యకత తల్లిదండ్రులు, గురువులపై ఎంతైనా ఉంది. వారు పిల్లలను సన్మార్గంలో పయనింపజేస్తే దేశం అన్ని రంగాలలో బలపడి ఇతర దేశాలకు ఆదర్శప్రాయమవుతుంది.

ఈ సత్యాన్ని గ్రహించిన పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, నవంబర్‌ 14వ తేదీని తన జన్మదినంగా గుర్తించవద్దనీ, బాలల దినోత్స వంగా గుర్తించాలని పేర్కొన్నారు. అందుకే చాచా నెహ్రూ జన్మదినోత్సవాన్ని 'బాలల దినోత్సవంగా' పేర్కొంటారు.

ఈ రోజును దేశమంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అలా 'బాలల దినోత్సవం' మొదలైందన్నమాట. ఈ సందర్భంగా స్కూళ్లల్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, కోలాహలంగా పిల్లలతో ఆడి, పాడించడం, వ్యాస రచన, వకృత్వ పోటీలు నిర్వహించడం, సర్వ సాధారణంగా గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది.

పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించని వాళ్లకు ఈ దినం కనువిపð కలిగిస్తుంది. ఈ రోజును ప్రత్యేకించి 'చిల్డ్రన్స్‌ డే' గా గుర్తించడం వల్ల, ఆ రోజు తల్లిదండ్రులు తమ పిల్లల అభి వృద్ధికి ఏయే పథకాలను రూపొందించుకోవాలన్న విషయాన్ని ఆలోచింపజేసే దినంగా ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పిల్లల తల్లి దండ్రులు వారి సంక్షేమానికై, గత సంవత్సరం ఏం చేశాము అన్న విషయాన్ని బేరీజు వేసుకోవ డమేకాక, ఈ సంవత్సరం చేపట్టబోయే పనుల ప్రణాళికను కూడా సిద్ధం చేసు కునేందుకు ఈ దినోత్సవం ఎంతో ఉపయోగపడుతుంది. దేశ భవిత వ్యం పిల్లల పైనే ఆధారపడి ఉంది కాబ ట్టి దేశ సౌభాగ్యం కోసం నెహ్రూ తన జన్మదినాన్ని 'బాలల దినోత్సవం' (చిల్డ్రన్స్‌ డే)గా గుర్తించాలని కో రడం వెనుక, పిల్లల్ని తల్లిదండ్రులు అలక్ష్యం చేయరాదన్న భావన ఇమిడి వుంది. ఈ రో జున దేశం మొత్తం జనాభా, తమ తమ పిల్లల అభివృద్ధినీ, సంక్షేమా న్నీ కాంక్షిస్తూ, వారి గురించి ఆలోచించా లన్నదే ఇందులోని పరమార్థం.

'బాలల దినోత్స వం'నాడు అక్కడక్కడా ప్రజలు గుమికూడి సమావేశాలను ఏర్పా టు చేసుకొని, పిల్లల భవితవ్యం గురించి చర్చించుకుంటారు. ఈ మీటింగ్‌లలో ఎం దరో పుర ప్రముఖులు పిల్లలను భౌతి కంగా, మానసికంగా, నీతివం తంగా ఎలా తీర్చిదిద్దాలో తమ ఉపన్యాసాలలో చెబుతారు.

పిల్లలను అలక్ష్యం చేయ కుం డా మసలుకుంటామని తల్లి దండ్రులతో ప్రతిజ్ఞ కూడా చేయిస్తారు.

ఈ రోజున పాఠశాలల్లో మిఠాయిలు పంచు కోవడమూ, ఉపాధ్యాయులు, పిల్లలకు చాచా నెహ్రూ జీవిత విశేషాలను చెప్పడమూ పరిపాటి. ఈ 'బాలల దినోత్సవం' నాడు అంటే, నవంబర్‌ 14న, బాలల సినిమా ఉత్సవాలను (చిల్డ్రన్స్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌) నెహ్రూ పుట్టినరోజున ప్రారంభించ డం ఆనవాయితీగా వస్తోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం మీద శ్రద్ధ వహించి, సృజన గల పిల్లల ప్రజ్ఞా పాటవాలనూ, నైపుణ్యాలను గుర్తిం చి, వారిని ప్రోత్సహించడం ముదావహం.

దేశం మొత్తం ఎంతో ఘనంగా చాచా నెహ్రూ జన్మ దినో త్సవాన్ని, ఆ యన జ యంతి సందర్భంగా) ఒక పండుగలా జరుపుకుంటారు.

'చిల్డ్రన్స్‌ డే'ను బాలబాలికలు, ఉపాధ్యా యులూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ, నెహ్రూ జాతికి అందించిన సేవలను స్మరించు కుంటారు. ఈ రోజున, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల, వారి బాధ్యతలపట్ల, ప్రత్యేక శ్రద్ధ వహి స్తారు. చూశారా బాలలూ! చాచా నెహ్రూ ఎంతో దూరదృష్టితో ఆలోచించి తన జన్మదినోత్సవాన్ని 'చిల్డ్రన్స్‌ డే'గా పేర్కొన్నారు కదూ!

మూలం: ఆంధ్రప్రభ- 13 నవంబర్ 2010

2 comments:

  1. బాలల పర్వదినం-నెహ్రూ జన్మదినం.

    ReplyDelete
  2. Nehru likes children so much

    ReplyDelete