Breaking News

తమనపల్లి అమృతరావు

జననం: 1920 అక్టోబరు 21
మరణం: 1989 ఏప్రిల్ 27

తమనపల్లి అమృతరావు (1920 - 1989) ప్రముఖ నాయకుడు మరియు గాంధేయవాది.

వీరు 1920 అక్టోబరు 21 తేదీన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విశదల గ్రామంలో జన్మించారు. కర్నూలు జిల్లా ప్యాపలి లో చదువుకొన్నారు. వీరికి చిన్నతనం నుండి రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ ఉండేది. విద్యార్థిగా ఉండగానే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. కొంతకాలం భారత విమానదళంలో పనిచేశారు. తర్వాత నిజాం స్టేట్ రైల్వేలో పనిచేశారు.

వీరు తమ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయదలచి గాంధీజీ మిషన్ అనే సంస్థను స్థాపించారు. తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు. విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించాలని 1966లో వీరు చేసిన సత్యాగ్రహం ఆంధ్రదేశాన్ని కుదిపేసింది. ఆ ఉద్యమంలో 32 మంది ప్రాణాలను కోల్పోయారు. విద్యార్ధులు బందులు నిర్వహించారు. ఆనాటి పరిస్థితిని ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి వివరించగా ఆమె సానుకూలంగా స్పందించడంతో వీరు దీక్షను విరమించారు. ఆ విధంగా విశాఖలో 1971లో ఉక్కు కర్మాగారం ఏర్పడింది.

వీరు 1978లో తాడికొండ నియోజకవర్గం నుండి కాంగ్రెసు అభ్యర్ధిగా పోటీచేసి గెలుపొందారు. షెడ్యూల్డు కులాల శాసనసభ కమిటీ అధ్యక్షుడిగా 1982 నుండి వారి అభ్యున్నతికి కృషిచేశారు. వీరు 1989 ఏప్రిల్ 27 తేదీన పరమపదించారు.

3 comments:

  1. ప్రముఖ నాయకుడు మరియు గాంధేయవాది తమనపల్లి అమృతరావు.

    ReplyDelete
  2. Pl send Amrutha Rao ji Books..as vizag steel lant history

    ReplyDelete