Breaking News

అన్నాప్రగడ కామేశ్వరరావు


అన్నాప్రగడ కామేశ్వరరావు ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. గుంటూరు జిల్లా నరసరావు పేట తాలుకా కనుమర్తిలో 1902 అక్టోబరు 21న జన్మించాడు. మెట్రిక్యులేషన్ వరకు విద్యనభ్యసించాడు. మొదటి ప్రపంచ యుద్ధములో మిలటరీలో చేరి పనిచేశాడు. 1922లో గుంటూరు పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొన్ని జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని మళ్ళీ జైలుశిక్ష అనుభవించాడు. 1931లో రహస్యంగా రష్యా చేరుకున్నాడు. 1936లో కొత్తపట్నం వద్ద రాజకీయ పాఠశాల నడిపాడు. యువతరానికి విప్లవ భావాలు నేర్పుతున్నాడని అప్పటి జస్టిస్ పార్టీ ఆధ్వర్యములోని ప్రభుత్వము పాఠశాల మూసివేయించింది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని వెల్లూరు, తంజావూరు జైళ్ళలో శిక్షననుభవించాడు. 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. గుంటూరు నుండి శాసనసభకు ఎన్నికైన తొలి శాసన సభ్యుడు.

1 comment:

  1. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు.

    ReplyDelete