భారతీయ గోవు-1
ఈ చారిత్రాత్మకమైన వార్త విన్నారా? ఎద్దులను చంపటం ఆపాలంటూ ముస్లిముల పిటిషన్..
ముంబయి హైకోర్ట్ తీర్పుతో గోప్రేమికులకు కొండంత బలం వచ్చింది.మొన్న మంగళవారం సెప్టెంబర్ 30న 12 వేల ఎద్దులను వధశాలలో వధించబోతుంటే హైకోర్ట్ ఆ వధను ఆపాలని తీర్పు ఇచ్చింది.
అక్కడి ప్రభుత్వమేమో బక్రీద్ రోజున చంపకూడదని ఎటువంటి నియమం లేదంటూ జులై 31 న ఆజ్ఞలు జారి చేసింది..హైకోర్ట్ ఆ ఆదేశాలను తప్పు పట్టింది.
గమ్మత్తేమిటంటే మహమ్మద్ ఫైజ్ ఖాన్ మరియు ఇర్ఫాన్ అలీ ఫిర్జాదా వంటి గోభక్త ముస్లిములు హైకోర్ట్ లో పిటిషన్ వేశారు.. వీళ్ళ అడ్వొకేట్ పేరు షిరాజ్ ఖురేషీ .బక్రీద్ రోజున ఎద్దులను కాని , గోసంతతిని కాని బలి ఇవ్వలన్న నియమం ఎక్కడా లేదని వీరు వాదించగా హైకొర్ట్ సమర్థిస్తూ తీర్పివ్వటం శుభసూచకం .
అలాగె పశ్చిమ బెంగాల్ కోర్ట్,గుజరాత్ కోర్ట్ లు కూడ గతంలో ఈ విధమైన తీర్పు ఇచ్చినట్లు మహరాష్ట్ర హైకోర్ట్ ఉదహరించింది.
ముస్లిం పిటిషనర్స్ ఏమని కోర్ట్ లో ఏమని తమ వాదన వినిపించారొ తెలుసా...?
హిందువులకు ఎద్దు ప్రియమైనదని,అది శివుడి వాహనంగా పూజిస్తారని, హిందువుల మనొభావాలు దెబ్బతీసి,ముస్లిం మైనారిటీ వోట్ల కోసం ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు వాదించారు.ఇస్లాం లో ఎక్కడా గోసంతతిని వధ చేయాలని పేర్కొనలేదని వాదన వినిపించారు.అంతే కాదు దారుల్ ఉలూం దియోబంద్ కూడా ఈద్ రోజున గోవులను వధించవద్దని ఫత్వా జారీ చేసినట్లు తెలిపారు.
పిటిషన్ వేసిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ సభ్యులు గవర్నర్ శ్రీ సి హెచ్ విద్యాసాగర్ రావ్ ని కలిసి,గోవధ విషయం లో జోక్యం చేసుకోవాలని కోరుతూ దిగిన ఫోటో ఇది.
ఇటువంటి పిటిషనే గోవా హైకోర్ట్ లో కూడ వేసినట్లు,గోవధను ఆపాలని కోర్ట్ స్టే ఇచ్చినట్లు తెలిసింది.
- అప్పాల ప్రసాద్.
ఈ చారిత్రాత్మకమైన వార్త విన్నారా? ఎద్దులను చంపటం ఆపాలంటూ ముస్లిముల పిటిషన్..
ReplyDeletetrue Indian Muslims.
ReplyDeleteSalute to this Indians
ReplyDelete