ముఖ్యమంత్రి కె సి ఆర్ . డైలాగులు ..తెలంగాణా అభివృద్ధికి ఆణిముత్యాలు?
***ముఖ్యమంత్రి కె సి ఆర్ . డైలాగులు ..తెలంగాణా అభివృద్ధికి ఆణిముత్యాలు.?
**'కర్కోటకుడు చంద్రబాబు..దిగువ సీలేరు ప్రాజెక్ట్ నుండి,క్రిష్ణపట్నం నుండి విద్యుత్త్ రాకుండ కుట్ర చేస్తుండు చంద్రబాబు..
(అక్టోబర్ 5న ఉదయం దత్తాత్రేయ గారి అలయ్ బలయ్ లొ చంద్రబాబు,కె సి ఆర్ కావలించుకున్నరు..సాయంత్రం కె సి ఆర్ చంద్రబాబుపై దుమ్ము రేపిండు)
**కరెంట్ కోతపై తానే కాదు తన తాత జేజెమ్మ వచ్చినా ఏమి చేయలేదు.
(కరెంట్ కోతతో ఎందరో రైతులు పురుగులమందు తాగి,ఉరేసుకుని తెలంగాణా జిల్లాల్లో చచ్చిపోతున్నరు..మూడేళ్ళ వరకు ఆత్మహత్యల ప్రక్రియ కొనసాగాలని ప్రభుత్వం చెప్పక చెపుతున్నట్టా?)
**తలకాయ తెగినా నిజం చెబుతా..
**మూడేళ్ళ తరువాత తెలంగాణా ఇండియా లో నెంబర్ 1 అవుతుంది.నా తల తాకట్టు పెట్టి అయినా ఇది సాధించి తీరుతా.
**ఆడపిల్లను చూడాలంటె ఉచ్చ పోసుకోవాలి.వాళ్ళను చూస్తే కళ్ళు పీకేసే కార్యక్రమం తీసుకుంటం.వాళ్ళను చూడాలంటే లాగు తడవాలిసిందే.
(కల్తీ కల్లు,మద్యం ప్రవేశపెట్టి,గ్రామ గ్రామాన యువకులకు అలవాటు చేసి,పిచ్చి పిచ్చి కోరికల వెంట పడేట్లు చేసి, 'కళ్ళు పీకేస్తా అంటే అంటే.'..అత్యాచారాలు ఆగిపోతాయా?)
**తెలంగాణాలో తెలంగాణా వారి విగ్రహాలే వుండాలి.
(మరి జాతీయ నాయకులు...డా.అంబేడ్కర్, గాంధీజి, సుభాస్ చంద్ర బోస్, బాబూ జగజీవన్ రాం..మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలంగాణా వారు కాదు కదా? . అలాగె కాంగ్రెస్ నేత రాజశేఖర్ రెడ్డి, ఎన్ టీ ఆర్, విగ్రహాల సంగతి ఏమిటి..)
**మెడలో గులాబి కండువా లేకపొతే 5వేలు జరిమానా.
(గుండెలో వుండాలి అభిమానం..భయపెడితే ఎలా?)
**చెరువుల పూడికతీత కోసం దక్షిణ భారత్ లోని జె సి బి లు అన్నీ తెలంగాణా లోనె ఇక్కడే పని చేయాలి.
**230 కోట్ల మొక్కలు నాటి, 'మొక్కలు నాటాలి..వానల్ వాపస్ రావాలి.' అని నినదిస్తం.( వాన దేవునికి.మేఘాలకు హెచ్చరికా)
**ఉప ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్ళు కుక్కల కన్న హీనంగ మొరిగిండ్రు.
(కుక్కలు అంటే కె సి ఆర్ బాసలో, తెలంగాణాలొ గౌరవపదం.)
**ఇంజనీరింగ్ కాలేజీలు బ్లాక్ మెయిల్ చేస్తే తోలు తీస్తం
**ప్రభుత్వం విషయంలో విపక్షాలు దిక్కుమాలిన వైఖరి తో వ్యవహరిస్తున్నాయి.
(ప్రభుత్వాన్ని విమర్శించే వారతా దిక్కు మాలిన వారే.)
**సెప్టెంబర్ 17,1948 న తెలంగాణా కు స్వాతంత్ర్యం వచ్చిన రోజు..మీరు మంచిగ వినాలె,అందరికి చెప్పాలె.కర్ణాటకలో 3 జిల్లాలు కలిసిన తరువాత, మహారాష్ట్ర లో 5జిల్లాలు కలిసిన తరువాత ఆ ప్రాంత ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 స్వాతంత్ర్యం జరుపుకుంటున్నరు.పెద్ద ముక్క అయిన ఇక్కడ ఎందుకు జరుపరు.? 10 ఏళ్ళనుండి మేము అడుగుతున్నం. చెప్పు క్రింద కుక్కిన పేను లెక్క పడుండాల్నా? రోశయ్య ను వరంగల్ లో అడిగితే ' పాత పద్దతే కొనసాగిస్తరట ' ఇట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.
(ఇదే ప్రశ్న ముఖ్యమంత్రి అయిన తరువాత కె సి ఆర్ ని అడిగితే మక్కికి మక్కి అదే డైలాగ్ కొట్టిండు.)
**దళితుల భూమి పంపిణీలొ ఒక్క రూపాయి లంచం అడిగితే ' చీరి చింతకు కడుతా '
'(గ్రామాల్లో పైసలు మింగుడు ఎక్కువ.. పనులు చేసుడు తక్కువ..99 శాతం ప్రజాప్రతినిధులు సిండికేటై ప్రభుత్వ సొమ్మును పంచుకుంటున్నరు.ఇది ఎవరిని అడిగినా చెబుతారు)
**దళితుడే తొలి ముఖ్యమంత్రి అవుతడని ఈ కె సి ఆర్ ప్రకటించిండు. నే చెప్పిన అంటే .. తల నరుక్కుంట కని మాట తప్పను. కచ్చితంగ తొలి ముఖ్యమంత్రి దళిత నాయకుడు వుంటడు..అని చెపుతున్న.
(దయ చేసి తల నరుక్కోవద్దు. గత ప్రభుత్వాలపై,నాయకులపై విద్వేషం కక్కకు.తెలంగాణా ప్రజలను మీ పడికట్టు పదాలతో రెచ్చగొట్టవద్దు.మాటలు తగ్గించి, అందరితో కలుపుకుని పని చేస్తే పనులైతయి.తెలంగాణా గౌరవం కూడా నిలుస్తది.)
తెలంగాణా మాండలికం పేరుతో ముఖ్యమంత్రి ఉపయోగించే భాష ఆయన స్థాయికి తగినధిగా లేదు.ఇది మార్చుకోవాలి.మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకోవాలి కాని,నవ్వు పుట్టించి,చప్పట్లు కొట్టించే జోకర్ భాష కాకూడదు.ప్రతి మాటను ప్రజలు గమనిస్తారు.ప్రింట్,ఎలెక్ట్రాన్ మీడియా సచేతనంగా వుంది.మీరు కె సి ఆర్ కాదు..కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి.ధర్మకర్త. మీరే ఇలా మాట్లాడితే తెలంగాణా సిగ్గు పోతది. ఇంత వయస్సు వచ్చిన తరువాత కొత్తగా అబ్బుతదా..? తప్పదు. చచ్చేంతవరకు కొత్త విషయాలు నేర్చుకోవాలిసిందే. లేకపొతే ఒక ముఖ్యమంత్రిగ మాత్రం చరిత్ర లో నిలిచిపొతారు.ప్రజలకు సంక్షేమ పథకాలు మాత్రమే కాదు..మీ వ్యవహారం కూడా ముఖ్యం.
- అప్పాల ప్రసాద్.
ముఖ్యమంత్రి కె సి ఆర్ . డైలాగులు ..తెలంగాణా అభివృద్ధికి ఆణిముత్యాలు?.
ReplyDeleteనిజం చెప్పారు ప్రసాద్ గారు..
ReplyDeletePeople of Telangana shouldn't accept like this comments spoke by CM.
ReplyDeleteaayana alaa maatlaade tana panulu saadhimchukumtunnaaru, adi telangana sentiment, ennukunna prajalaku meelaati vallu avagahana kalagajeste prayojanam koddo goppo umdavachchu. amtavaraku mana gati imte.
ReplyDeletegorrelaite alane vintaaru panikiraani maatalu.
Deleteతెలంగాణ ప్రజలు ఆలోచించాలి.
ReplyDelete:)
ReplyDeleteShould think about this!!!!
ReplyDelete