భారతీయ గోవు-3
గోసంతతి కారణంగా 1835 వరకు మన దేశం లోని గ్రామాలు స్వావలంబనతో నిలిచాయి..
గోవు పేడ,గో మూత్రం,పశుసంపద వల్ల భూమి సారవంతంగా వుండి,సంవత్సరానికి 2,3 పంటలు పండి,సస్యశ్యామలంగా విలసిల్లాయి.
వ్యవసాయం లాభసాటిగా వుండటం,వ్యవసాయానికి కావలసిన అన్ని పరికరాలు అలాగే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు బాగా నడిచాయి.
ప్రతి చేతికి పని వుండి అందరికి ఉపాధి అవకాశాలు వుండి, అదాయం కలిగివుండి,పేదరికం జాడలు కనపడలేదు.
అందరికీ సంపద వున్న కారణంగా దొంగబుద్ధి ఎవరికీ లేదు.గ్రామాల్లో దొంగలు,బిచ్చగాళ్ళు
లేరు.
గ్రామాల్లో ప్రతిరోజు నడిచే పాఠశాలలు దేశంలోని 6,40,000 గ్రామాల్లో వున్నాయి. మందిరాలు వున్నాయి. ప్రజల డబ్బుతో అవి నడిచాయి.
పోలీస్ స్టేషన్లు,కోర్టులు లేవు.వివాదాలన్నీ గ్రామస్థులే పరిష్కరించుకునేవారు.
గ్రామాలు బలంగా వుండి,దేశం సుసంపన్నంగా వుంది.
చూశారా?
ఒక్క గోవు,పశుసంపద దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క చక్రం తిప్పింది.విద్యా,ధార్మిక రంగాలకు ఆధారంగా నిలిచింది.
మరి ఆ గోవును లేకుండా చేస్తే ??? వ్యవసాయం,గ్రామీణ పరిశ్రమలు,గుడి,బడి కుప్పకూలిపోతాయి. అదే జరిగింది..
1835 ఫిబ్రవరి 2 లో లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్ లో ఈ కుట్ర కు బీజం వేశారు. భారత దేశ గొప్పతనాన్ని చెపుతూనే,అన్నిటికీ ఆధార బిందువైన గోవుల పైన వేటు వేశారు.గ్రామీణ సంస్కృతిని దెబ్బతీసేందుకు ప్రణాళిక రచించారు.విద్యా వ్యవస్థను కూకటివ్రేళ్ళతో పెకిలించేందుకు యత్నించారు..
మన దేశం తో పాటు 71 దేశాల్లో పరిపాలన చేస్తున్న ఆంగ్లేయులు,ఆ దేశాలకు, మన దేశం లోని ఆవులను చంపి మాంసం పంపించారు.కోట్ల పశువులను ఆంగ్లేయుల కాలం లో వధించి,గ్రామీణ వ్యవస్థను దెబ్బతీశారు.
అది ఇప్పటికీ కొనసాగుతుంది.తెల్లవాళ్ళ ధోరణిలో మనపట్ల సామ్రాజ్యవాద పెత్తనం తో నే చూస్తున్నరు. దానికి ఉదాహరణ మన శాస్త్ర వేత్తలు చెపట్టిన మంగళ యానం విజయవంతం కావటం జీర్ణించుకోలేక పొతున్నారు. న్యూ యార్క్ టైంస్ పత్రికలో మన దేశాన్ని చులకన చేస్తూ కార్టూన్ ప్రచురించారు. భారతీయుడి వేషమైన ధొవతీ మరియు పశువులను వెక్కిరిస్తూ,తమ జాత్యహంకారాన్ని ఇప్పటికీ చాటుకున్నారు.
- అప్పాల ప్రసాద్.
భారతీయ గోవు-3
ReplyDeleteGood one
ReplyDeleteNice post
ReplyDelete