పాగ పుల్లారెడ్డి
జననం: 1919, మే 2
మరణం: 2010, అక్టోబరు 20
ప్రముఖ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడైన పాగ పుల్లారెడ్డి 1919, మే 2న జన్మించాడు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు మరణించగా గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ సహాయంతో విద్యాభ్యాసం పూర్తిచేశాడు. 1947-48 కాలంలో హైదరాబాదు సంస్థానం భారత యూనియన్ లో విముక్తి కావడానికి చేపట్టిన ఉద్యమంలో చేరి చురుకుగా వ్యవహరించాడు. 3 మాసాలు గౌతు లచ్చన్న నిర్వహించిన సైనిక శిభిరంలో శిక్షణ పొంది కర్నూలు ప్రాంతం డిక్టేటరుగా నియమించబడ్డాడు. విమోచనోద్యమ అనంతరం 1952లో గద్వాల-ఆలంపూర్ ద్విసభ్య నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనాడు. 1968లో గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, 1972లో గద్వాల నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనాడు. 1984-87 కాలంలో గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మెన్ గా పనిచేశాడు. కళారంగానికి ఎంతో కృషిచేసి కళారంగపోషకుడిగా పేరుపొందినాడు. 198లో గద్వాలలో లలితకళాభివృద్ధి సంఘం ఏర్పాటుచేయడమే కాకుండా బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాతుపడ్డాడు. ప్రతినెల సాహితీసాంస్కృతిక కార్యక్రమం నిర్విరామంగా నిర్వహించాడు.
ప్రముఖ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు అయిన పాగ పుల్లారెడ్డి.
ReplyDelete