Breaking News

దేశభక్తి అంటే ?

ఇప్పుడు ఈ విషయం ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్య చదివిన ఒక సంఘటన విషయం నన్ను ఎంతగానో స్పందింపజేసింది.

అదేమిటంటే ఒకసారి స్వామి రామతీర్థ జపాన్‌లో పర్యటిస్తూ అందులో భాగంగా రైలులో ఒక ఊరి నుండి మరో ఊరికి ప్రయాణిస్తున్నాడు.స్వామికి మధ్యలో ఆకలి అయ్యి పండ్ల కోసం ఒక స్టేషన్‌లో దిగి పండ్ల కోసం వెదికాడు.కాని ఎక్కడా దొరకలేదు. అలానే రైలు ఆగిన మరో మూడు స్టేషనులలో ప్రయత్నించాడు కానీ దొరకలేదు.

ఇదంతా గమనిస్తోన్న ఎదుటి సీట్‌లో కూర్చొని ఉన్న ఒక జపాన్ కార్మికుడు రైలు మరో స్టేషనులో ఆగుతుందనగా రైలు ఆగీఆగకనే దిగివేసి బయటకు పరుగెత్తుకు వెళ్ళి పండ్లు కొనుక్కొనివచ్చి రామతీర్థ గారికి ఇచ్చాడు.రామతీర్థ గారు "ఎందుకంత కష్టం తీసుకొన్నావు?" అంటూ డబ్బు అతని చేతికి ఇవ్వబోగా అతను తీసుకోవడానికి నిరాకరిస్తూ ఒక్క మాట మాత్రం అన్నాడు.

"స్వామీ! మీరు జపాన్ నుండి భారతదేశమునకు తిరిగవెళ్ళిన తర్వాత అక్కడ మీరు జపాన్ లో కనీసం తినడానికి కూడా పండ్లు దొరకలేదని అనకండి.అందుకే నేనిలా చేసాను.అదే మీరు నాకు ఇచ్చే పదివేలు" అన్నాడు.

ఒక చిన్న విషయం దగ్గర కూడా జపాన్ వారి దేశభక్తి ఎలా వెల్లడైందో గమనించారా?

ఇక మన విషయానికి వద్దాం.మనకు దేశానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడో కానీ లేక ఎక్కడో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడో కాని దేశభక్తి అన్నది గుర్తుకురాదు.

పై సంఘటనలో లాగా మనలో ఎంతమందికి నరనరానా దేశభక్తి జీర్ణించుకుపోయింది?

మనకు ఏదైనా పెద్ద సంఘటన జరిగితే దేశభక్తిని ప్రదర్శిస్తాము తప్ప మన నిత్యజీవితములో దానిని నిజముగా పాటిస్తున్నామా?

మనదేశము లోని కొన్ని కామకుక్కలు ఎంతగా దిగజారి పోయాయంటే మనదేశానికి వచ్చే విదేశీ పర్యాటక మహిళలను బలాత్కరిస్తున్నారు.డబ్బు కోసం ఆ పర్యాటకుల వద్ద యాచిస్తున్నారు.ఎంత చులకన?

దీనివలన దేశానికి అంతర్జాతీయముగా ఎంత తలవంపులు వస్తున్నాయో మనకు తెలుసు.దేశభక్తి నిజముగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయంటారా?

9 comments: