గ్రామ స్వరాజ్యం-పంచాయితీలలో సుపరిపాలన
పంచాయితీలలో సుపరిపాలన
(ఎ).గ్రామాన్ని నివాసయోగ్యం చెయ్యాలి
·
శుద్ధి చేసిన మంచినీరు
·
చేత్తా చేదారం తొలగింపు
·
మురుగు కాల్వల నిర్వహణ
·
రోడ్లు – లైట్లు
·
ఇతర సమస్యలు
1.గ్రామాలను నివాసయోగ్యం చేసుకుందాం
మన గ్రామాలు గతం కంటే బాగున్నాయి. కొన్ని గ్రామాలలో సిమెంట్
రోడ్లు, తారు రోడ్లు వచ్చాయి. పుంతలు, కంకర రోడ్లు తగ్గుముఖం పట్టాయి. కొన్ని
గ్రామాలలో మురుకి నీరు పోవటానికి సిమెంట్ డ్రైనులు, కచ్చా డ్రైనులు వచ్చాయి.చాలా
గ్రామాలలో మంచినీటి సరఫరా కు ట్యాంకులు, కులాయిలు వచ్చాయి. చేతి పంపులు
అందుబాటులోకి వచ్చాయి. కొన్ని గ్రామాలలో నీటిని కులాయిలు ద్వారా సరఫరా చేస్తున్నారు.
ఇదంతా అభివృద్దే. కాదని ఎవరూ అనరు. ఇంతమాత్రం చేత గ్రామాలు నివాసయోగ్యం అయినట్టేనా
? నిస్సందేహంగా కాదు. అందుకే నివాసయోగ్యమైన గ్రామాలు అన్నది నినాదం కావాలి.
అభివృద్ధి ప్రజల జీవితాలలో ప్రతిబింబించాలి. వారికి సుఖ సంతోసాలను అందించాలి.
1.
ఇప్పటకి ముక్కు మూసుకోకుండా
ప్రవేసించే పరిస్తితి ఎ గ్రామానికి రాలేదు. రోడ్ల పక్కన, చేరువు గట్లు, కాలవ పక్కన బహిరంగ మలవిసర్జన సాగిపోతున్నది. ఈ
దుర్ఘంధం గాలిని కలుషితం చేసి ఊరంతా వ్యాపిస్తున్నది.బహిరంగ మాలవిసర్జన వలన నిరు
కలుషితం అవుతున్నది. గ్రామం అంతటిని అనారోగ్యం పాలు చేస్తున్నది. గ్రామంలో ప్రతీ
ఇంటికి మరుగుదొడ్డి ఉండి తీరాలి. వాటిని అందరూ వినియోగించాలి. గ్రామంలో ఎట్టి
పరిస్తితులలోను బహిరంగ మల విసర్జన జరగకూడు. బహిరంగ మల విసర్జన జరిగే గ్రామం
నివాసయోగ్యం కాజాలదు.
2.
గ్రామంలో ఎంత మంచి రోడ్లు ఉన్నా
వాటిమీద పెంటకుప్పలు చేత్తకుప్పలు ఉండకూడదు. ఇవి గాలిని కలుషితం చేస్తాయి. ఈగల
మందల్ని పెంచుతాయి. వీటి ద్వారా గ్రామం అంతటాకీ అంటువ్యాధులు సోకుతాయి. ఈ చెత్తను
తోలిగించుటకు క్రమపద్దతిగల ఏర్పాటు ఉండాలి. గ్రామంలో పెంతకుప్పలు ఉన్నంతకాలం ఆ గ్రామం
నివాసయోగ్యం కాజాలదు.
3.
గ్రామంలో మురుగు నీరు
కాల్వలు వుంటే సరిపోదు. అవి పూడి పోకూడదు. మురికి నీరు నిల్వ ఉండకూడదు. అలాగే
గ్రామంలో మురికి గుంటలు ఉండకూడదు. ఇవి ఉంటె దోమలు ఉంటాయి. దోమలు 18 రకాల జబ్బులకి కారణం
అవుతాయి. దోమల దండు వున్న గ్రామం నివాసయోగ్యం కాజాలదు.
4.
గ్రామంలో మంచి నీళ్ళ
ట్యాంక్ వుందని, చేతిపంపు వున్నదని సంతృప్తి పడకూడదు. మనం తాగేనీరు కచ్చితంగా
మంచిదై వుండాలి. నీళ్ళ ట్యాంకలను నిర్దిష్ట వ్యవదిలో శుబ్రం చేయాలి. క్లోరిన్
కలపాలి. కులాయిలకు నీరు సరఫరా చేసే గొట్టాలకు చిల్లులు వల్ల నీరు కలుషితం కాకుండా
చూసుకోవాలి. ప్రతి కుళాయి దగ్గరా మంచి నీరు వస్తుందో లేదో ప్రతీ ఆరు నెలలకైనా
పరిక్ష చేయాలి. పంచాయతీ ఇచ్చే నీటి వలన జబ్బులు రాకూడదు. పరీక్షించిన నీరు
అందించని గ్రామం నివాసయోగ్యం కాదు. గ్రామాలలో ప్రజలకి వచ్చే 80 శాతం జబ్బులకి ఈ
నాలుగు అంశాలే కారణంగా వున్నాయి. జ్వరాలు, వాంతులు,విరేచనాలు, కామెర్లు,- దురదలు వంటి వ్యాధులు మనగ్రామాలను పట్టుకొని వదలటం లేదు.
ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేక ప్రైవేటు వైద్యం భరించరానిదై ప్రజలు నలిగి
పోతున్నారు. రొజూవఛి పడుతున్న రోగాలను నయం చేసుకోవడానికి పేదలు
అప్పులపాలవుతున్నారు. తిరిగి కోలుకోలేని సుడిగుండంలో పడిపోతున్నారు. ఆరోగ్యం కోసం
ఇల్లు గుల్ల అవుతున్నది. జబ్బులతో శరీరాలు డొల్ల అవుతున్నాయి.
2. ప్రజల సొమ్ముతో
నడుస్తున్న ప్రభుత్వ సంస్థల సేవల్ని మెరుగుపరచాలి
మన గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు వున్నాయి. వైద్య సేవలు
అందించే ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. పశు వైద్య కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీలు
రేషన్ షాపులు వున్నాయి. ఇవన్ని ప్రజల సొమ్ముతో నడుస్తున్న సంస్థలు. ప్రజలకు సేవలు
అందించాల్సిన సంస్థలు.
ప్రభుత్వ పాఠశాలలలో పిల్లల
చదువు అంతంత మాత్రమే అయ్యింది. సామాన్యులు, పేదలు కూడా తమ పిల్లల్ని ఈ పాఠశాలలకి
పంపడానికి ఇష్టపడటం లేదు. స్వంత డబ్బు కర్చు పెట్టుకొని నన్వెంట్లకు పంపాలని
మోజుపడుతున్నారు.
ప్రజల డబ్బుతో నడిచే పాఠశాలలు మనం ఉపయోగంలోకి తేవాలి.
ఉపాధ్యాయులు లేకపోతె తెచ్చుకోవాలి. కనీసం తగినంత మంది విద్యా వాలంటీర్లనైన ఏర్పాటు
చేసుకోవాలి. అదీ లేకపోతె గ్రామంలో స్వచ్చందంగా పిల్లలకు పాఠాలు చెప్పడానికి
ముందుకు వచ్చే యువతీయువకులను, రిటైర్డ్ ఉద్యోగుల సేవలను ప్రోత్సహించాలి. పాఠాశాల
మీద, ఇంటి దగ్గర పిల్లల చదువు మీద శ్రద్ధపెట్టేలా తల్లిదండ్రులను చైతన్యపరచాలి.
ప్రజా కమిటీలను పని చేయించాలి.
అలాగే వైద్యసేవలు
అందించే కేంద్రం దాని నియమ నిభందనల ప్రకారం పనిచేసేలా చెయ్యాలి. రేషన్ షాప్
నిబంధనలు ప్రకారం సరుకులు అమ్మాలి.పనివేళలు పాటించాలి. ఇలాంటి ప్రభుత్వ సంస్థల మీద
పెట్టె లక్షల రూపాయల ఖర్చు మనకళ్ళముందే వృధా అవుతుంటే చూస్తూ ఉరుకొకూడదు. అక్కడ
పరిస్తితులను మార్చి తీరాలి. పేదలు సామాన్యులు పాఠశాలవిద్య, ప్రాధమిక ఆరోగ్యం మీద
తమ స్వంత జేబులనుంచి వందలు, వేలు, ఖర్చు పెట్టె స్తితి గ్రామాలలో తొలగిపోవాలి.
ప్రభుత్వ సంస్థల సేవలను పొందితీరాలి.
౩.వివిధ సంక్షేమ పదకాల – అమలు తీరు – ఇతర అంశాలు
(ఎ) ప్రభుత్వ సంక్షేమ పదకలు అర్హులకి దక్కాలి – అవినీతి లేకుండా అమలు
కావాలి
కేంద్ర
రాష్ట్రప్రభుత్వాలు సుమారు 20 రకాల పదకాలను గ్రామాలలో అమలు చేస్తున్నాయి. యువతకు
ఉపాది దగ్గరనుండి మహిళలు, దళితులు, పేదలు,
వృద్దుల సంక్షేమం కోసం ఈ పధకాలు ఉద్దేశించబడ్డాయి.
ఈ పధకాల సమాచారావు సకాలంలో లబ్దిదారులకు అందడం లేదు. పధకం
వస్తే దాని వివరాలు ముందుగా ప్రజలకు తెలియజేప్పే ఏర్పాటు ఉందితీరాలి. అర్హులైన
లబ్దిదారుల జాబితాను రూపొందించడం – గ్రామసభలలో వాటిని ఆమోదించే ఏర్పాటు ఉండాలి.
ఎంపికలో గాని, పధకం ప్రయోజనం పొందేటప్పుడు కాని అవినీతి
జరగకుండా తగు ఈర్పాటు వుండాలి. అన్ని పధకాలను ఈ పద్ధతుల్లో అమలు చేస్తే అవినీతి
లేకుండా అర్హులకు ఈ పధకాల ప్రయోజనం చేకూరుతుంది.
(బి) ఇతర అంశాలు
గ్రామంలో అందరికీ
అవసరమైన అంశాలు వుంటాయి. గ్రామం పచ్చగా వుండాలి. చెట్లు పెంచాలి. పిల్లలు
ఆడుకోవడానికి స్థలం వుండాలి. సభలు సమావేసాలు జరుపుకోవడానికి సాంకృతిక కార్యక్రమాల
నిర్వాహణకు చిన్న ఏర్పాటు వుండాలి. శ్మాశానాల లో కనీస వసతులు వుండాలి. ఇలాంటి
ప్రజావసరాలను తీర్చడానికి ప్రత్యెక శ్రద్ధ చూపించాలి.
ఈ వ్యాసాన్నిప్రచురించాను అంటే తప్పులు లేకుండా టైపు చేసి నాకు పంపిన "సాయి కుమార్, ఎల్లమంచిలి" కి కృతఙ్ఞతలు.
- సాయినాథ్ రెడ్డి.
గ్రామ స్వరాజ్యం-పంచాయితీలలో సుపరిపాలన
ReplyDeleteNice post. Useful information.
ReplyDeleteGrama Swarajyam.. Good article
ReplyDeleteThank you Sai Kumar garu..
ReplyDeleteThank u Sir
DeleteGood work Sai Kumar garu .
Delete