Breaking News

ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే


"కుబేర వైభవం ఒక పక్క కుచేల దారిద్ర్యం మరో పక్క" అన్నట్లు ఉంటుంది భారతదేశంలోని పరిస్థితి. ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ ఆర్థిక అంతరాలు, అసమానతలు పూర్తిగా తొలగిపోలేదు. వాస్తవానికి ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. యువత ముందుకు ఉరకాలి. పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు పూర్తిగా అతడు అనుభవించగలగాలి. అక్ష్యరాస్యత శాతం పెరిగితే మరింత మంచి ఫలితాలు సొంతమవుతాయి. మంచి పాలకులను ఎన్నుకుంటే స్వచ్చమైన పాలన అందుతుంది. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. కులం, మతం, ఇతర ప్రలోభాలకు లోనైతే చేజేతులా దేశ భవిష్యత్తును నాశనం చేసుకున్నట్లే. మేథో వలసలు తగ్గాలి. దేశంలో ఒక వైద్యుడిని తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.37.50 లక్షలు ఖర్చు చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చదువుకుని ఉద్యోగాలకు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. దీన్ని అరికట్టే సత్తా యువకులకే ఉంది. మేధావులను, విద్యావంతులను ప్రోత్సహించాలి. ఆస్ట్రేలియాలో ఓటు హక్కు వినియోగించుకొని వారికి ప్రభుత్వం కల్పించే సౌకర్యాల్లో కోత విధిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి మన దేశంలో చట్టాలు మరింత ఆచరణయోగ్యం కావాలి. సగానికిపైగా యువ జనాభా ఉన్న మనలాంటి దేశాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు యువతే నడుం బిగించి కదలాలి.

జై హింద్..
వందేమాతరం...
-సాయినాథ్ రెడ్డి.

5 comments: