శ్రీ దత్తోపంత్ చెప్పిన ఈ కథ వింటారా
శ్రీ దత్తోపంత్ చెప్పిన ఈ కథ వింటారా...
'ఎలీస్ ' అనే చిన్న పిల్ల జనం మధ్యలో తల్లి నుండి విడిపోయి,తప్పిపోతుంది.కంగారుగా అటూ ఇటూ చూస్తూ ఏడుస్తూ వుంటుంది. ఇంతలో ఒక పిల్లి ఎదురుగా వస్తుంది.'పిల్లీ..పిల్లీ ..మా ఇంటికి దారి చెప్పవా? అని అడుగుతుంది.అప్పుడు ఆ పిల్లి 'మీ ఇంటి అడ్రస్ చెప్పగలవా? చెప్పితే నేను దారి చెప్పేస్తాను ' అని అంటుంది.అప్పుడు ఎలీస్ 'నాకు అడ్రస్ తెలియదు 'అని అంటుంది. 'నీవు అడ్రస్ చెప్పక పోతే నీకు దారి ఎలా చూపించగలను? ' అంటూ పిల్లి జవాబు చెప్పింది.
మనలో చాలమందికి మన గమ్యమేమిటో స్పష్టంగా తెలియదు.పరుగులు తీస్తున్నాము కాని చేరుకోవలిసింది ఎక్కడికో తెలియదు.
- అప్పాల ప్రసాద్.
శ్రీ దత్తోపంత్ చెప్పిన ఈ కథ వింటారా....
ReplyDelete