Breaking News

భారతరత్న గోవింద్ వల్లభ్ పంత్

జననం : 1887 సెప్టెంబరు 10
మరణం : 1961 మార్చి 7


గోవింద్ వల్లభ్ పంత్ భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ నాయకుడు. హిందీ ని భారత దేశ అధికార భాష గా చేయడానికి ఈయన కృషి చేశాడు.

ఒక పేద కుటుంబములో జన్మించిన పంత్, వకీలు వృత్తిని ఎంచుకుని 1914 లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యాజ్యములో విజయం సాధించాడు. 1921లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి గెలవడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టాడు. 1937-39, 1946-50 లలో సంయుక్త రాజ్యాలకు (United Provinces: యునైటెడ్ ప్రావిన్సెస్) ముఖ్యమంత్రిగా, ఆ పైన ఉత్తర్ ప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1950-54 లలో తొలి ముఖ్యమంత్రిగా పని చేశాడు. 1955 లో కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఈయనకు 1957 లో భారతరత్న పురస్కారం లభించింది.

1 comment:

  1. భారతరత్న గోవింద్ వల్లభ్ పంత్.

    ReplyDelete