Breaking News

జీతం సమర్పయామి

ఎంపీల నెలవారీ జీతం యాభైవేల రూపాయలు. దీనికితోడు నియోజకవర్గ భత్యం పేరుతొ నలభై అయిదువేలు ఇస్తారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే మందిమార్బలం ఉండాలిగా! పర్సనల్ అసిస్టెంట్లు, పొలిటికల్ సెక్రటరీలు అవసరం అవుతారుగా! అందుకే, కార్యాలయ నిర్వహణ కోసం ఇంకో నలభై అయిదువేలు ఉదారంగా మంజూరు చేస్తోంది కేంద్ర సర్కారు. అంటే, మొత్తం లక్ష నలభై వేలన్నమాట! సభలో మాట్లాడినా మాట్లాడకపోయినా, కునుకుతిసినా గురకపెట్టినా, ఈ గొడవంతా ఎందుకని రిజిస్టరులో సంతకం పెట్టేసి, చక్కగా చేక్కేసినా... రోజుకు రెండువేల జితభాత్యం మాత్రం ఎక్కడికి పోదు. ఎమ్మల్యే లకు అయితే, జీత భాత్యాలన్నీ కలిపి రూ.లక్ష పైమాటే! జీతం కింద వచ్చేది పన్నెండు వేలే అయినా, నియోజకవర్గ భత్యం రూపంలో నెలకు రూ.83,000 వస్తోంది. రోజువారి భత్యం రూపంలో మరో రూ.800 అదనం. వ్యక్తిగత సిబ్బంది నిర్వహణ భత్యం ముప్ఫై వేల దాకా అందుతుంది.
- సాయినాథ్ రెడ్డి.

2 comments:

  1. జీతం సమర్పయామి

    ReplyDelete
  2. రాజకీయాలకి వచ్చేదే సేవ చేయటానికి. వాళ్ళకి ఇవాన్ని ఎందుకు?

    ReplyDelete