Breaking News

మే 18వ తేదీ,2009 లో 'ది స్టేట్స్ మన్ 'పత్రిక ఇలా హెచ్చరించింది


'చైనా వస్తువుల డంపింగ్ వల్ల భారత మార్కెట్లకు,ఉత్పత్తిదారులకు తీరని నష్టం వాటిల్లుతున్నది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్ లోని పరిశ్రమలు పూర్తిగా మూతపడటం ఖాయం.' ఈ హెచ్చరిక బహిరంగంగా చేసిన తరువాత చైనాతో మన వ్యాపర లోటు 127బిలియన్ డాలర్లు పెరిగిందే కాని తగ్గలేదు.ఇప్పుడైతే ఏకంగా 175బిలియన్ డాలర్ల లోటు తో మన వ్యాపారం కొనసాగుతుంది. లోటు వచ్చినప్పటికినీ,మన దేశం చైనాకు సహకరించే విధానాలు అవలంబిస్తున్నది.ఎందుకు? సరిహద్దుల్లో సమస్యలు తగ్గుతాయని భారత్ భావిస్తున్నది ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశించడానికి చైనా తోడ్పడుతుందని అనుకుంటున్నది కాని ఇవేవీ పనిచెయటం లేదు.ఇప్పటివరకు చైనా మన సరిహద్దుల్లోకి 1500 సార్లు చొరబాట్లు జరిపిందంటే,మన ప్రభుత్వ వ్యూహము ఎలా బెడిసికొడుతుందో అర్థమవుతున్నది.
- అప్పాల ప్రసాద్.

4 comments:

  1. మే 18వ తేదీ,2009 లో 'ది స్టేట్స్ మన్ 'పత్రిక ఇలా హెచ్చరించింది

    ReplyDelete
  2. Govt must react seriously....

    ReplyDelete
  3. Yes. its time to react now

    ReplyDelete