Breaking News

పించన్ పైసల్


ఒక్కసారి ఎంపీగా ఎంపికైతే చాలు, బతికిన్నంత కాలం నెలకి ఇరవై వేల రూపాయల పించను బ్యాంకు ఖాతాలో పడిపోతుంది. "ఇదేం అన్యాయం అధ్యక్షా ! ఒక్కసారి గెలిచిన వాళ్లకీ నాలుగుసార్లు గెలిచినవాళ్ళకీ ఒకటే లెక్కా!" అంటూ పోడియంలోకి దూసుకెళ్ళే సీనియర్ ఎంపిల్ని సంతృప్తి పరచడానికీ తగిన ఎర్పాటులున్నాయి. ఒకవేళ ఎవరైనా... ఒక విడత కన్నా ఎక్కువ సార్లు ఎంపీగా పనిచేస్తే.. ఎన్ని సంవత్సరాలు అదనంగా పనిచేస్తే అన్ని పదిహేనువందలు నెల నెలా కలుస్తాయి. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ శాసనసభ్యుల విషయానికొస్తే...మాజీ ఎమ్మెల్యేల పించను కనీసం పదిహేను వేల రూపాయలు. ఒకవేళ రెండుసార్లు ఎన్నికైతే 20వేలూ, అంతకన్నా ఎక్కువ సార్లు ఎన్నికైతే పాతికవేల రూపాయలూ చెల్లిస్తారు.

ఇదంతా మనం కట్టిన పన్ను డబ్బులే అన్న విషయం గుర్తుంచుకోండి పౌరుల్లారా.

జై హింద్.

- సాయినాథ్ రెడ్డి.

1 comment: