Breaking News

భారతీయ మహిలకు చెయ్యెత్తి దండం పెడదాం-3


సునీతి...ధ్రువుని తల్లి..భక్తి ని బోధించి శ్రీమన్నాయణుడుని సేవించమని కొడుక్కి బోధించింది.
ఉషా..చిత్రకళలో ప్రతిభ వుంది..గిరిజన సంప్రదాయంలో శ్రీకృష్ణుని మనవడైన అనిరుద్ధుణ్ణి పెళ్ళాడుతుంది..ఉషా పరిణయం పాటలు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పాడే ఆచారముంది.
రాధ...శ్రీకృష్ణునితో రాసలీలలాడుతుంది.ఆ వ్యూహంతోనే మహిళలను ప్రోగుచేసి కోలాటాలాడుతూ కంసుణికి వ్యతిరేకంగా జన ఉద్యమాన్ని నిర్వహిస్తుంది రాధ..రాధ శరీరాని ప్రేమించదు..కృష్ణ తత్త్వాన్ని ప్రేమిస్తుంది..అది అర్థం కాని వారికి అది పిచ్చి ఆటలుగా కనిపించటం సహజం..
సత్యభామ,జాంబవతి, రుక్మిణి ఇలా కృష్ణునితో ఆడిన స్త్రీలందరూ లోక కల్యాణంలో చక్కని పాత్ర పోషించారు.ఇందులో భౌతిక శారీరిక సౌఖ్యం కంటే ఆత్మసౌందర్యం తో కూడిన అంశాలు ఇందులో ఇమిడి వున్నయి..
మగవాళ్ళు,ఆడవాళ్ళు ఇలా ఎవరూ తక్కువ ఎక్కువకాదు..ఇద్దరూ సమానమనే శంకరుని అర్థనారీశ్వరుని తత్త్వం వుందని అర్థం చేసుకోవాలి.
పతివ్రత మండోదరి..రావణుని భార్య ..భర్తకు తన తప్పులు తెలియచేసింది.
మంధర ...అసూయ ని కల్పించి,రామయణాన్నే ఒక మలుపుతిప్పిన రాజకీయ దురంధర.ఆడది తలుచుకుంటె అయోధ్యనే అడివిగా చేస్తుందనటానికి మంధర ఒక ఉదాహరణ.
కైక..భరతుని కోసం రాముణ్ణి అడవౌలకు పంపింది.వ్యక్తిగతంగా సీతారాములకు కష్టం కలిగించినా,రావణ సంహారం కోసం కైక ఇలా వ్యవహరించింది.
తార..వాలి భార్య...వాలి,రాముని చేతిలో హతుడైనా..తన కొడుకు అంగదుడికి రాజ్యాభిషేకం చేయించి ప్రజలను పాలించింది..వాలి చనిపొతే దూరంగా బాధతో పారిపోలేదు.
కైకసి...రావణుని తల్లి,,కొడుకులకు దుర్మార్గాన్ని బోధిస్తుంది..దాని ఫలితమే కొడుకుల దుర్వ్యవహారాలు..తల్లి బాగుంటే ఈ పరిస్థితి తలెత్తేదేకాదు.ఒక విభీషణుడు మాత్రమే తల్లి చెడు మాటలు వినక ధర్మంగా వున్నాడు.
ఊర్మిళ...భర్తకు అనుగుణంగా జీవించింది.భర్త లక్షణుడు 14 ఏండ్లు వనవాసం వెళ్ళినప్పుడు..ఆమె పొయింది నిద్ర కాదు..ప్రణవాన్ని ధ్యానిస్తూ యోగ నిద్రలొ వున్న మహొన్నతురాలు ఊర్మిళ..
సీత....సాధు శీలి..ధర్మధర్మాలు తెలిసినది.ఎవరు భయపెట్టినా లొంగనిది.రాముడే రక్షకుడని విశ్వసించింది.ఒకానొక సమయంలో భర్త వదలిపెట్టినా తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పింది..పరమ పునీత లోకమాత సీత..
- అప్పాల ప్రసాద్

1 comment:

  1. భారతీయ మహిలకు చెయ్యెత్తి దండం పెడదాం-3

    ReplyDelete