Breaking News

భారతీయ మహిళ-1


స్త్రీలో దివ్యత్వం వుంది..ఆ విషయం ఆమె గుర్తించకపొతే ఆమె గర్భంలో వున్న పిండానికి ఆ దివ్య శక్తిని అందించలేదు.ఈ భూమిపై మానవత్వం రక్షించబడాలంటే మంచి మానవత్వం కలిగిన సంతానానికి జన్మ నివ్వాలి. ఈ సత్యాన్ని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు.అది ఇప్పుడు అందరికి గుర్తు చేసి ప్రపంచాన్ని పతనం నుండి రక్షించాలి.అది మన భారత దేశానికే సాధ్యం.
స్త్రీని చిన్న చూపు చూడకు.ఆమె బలహీనురాలైతే ప్రపంచమే బలహీనపడుతుంది.జంతువులు కూడా పిల్లలను కంటాయి..గుణగణాలున్న మానవులకు జన్మనిచ్చే అదృష్టం స్త్రీలకే వుంది..
నీవు స్త్రీని సరిగ్గ అర్థం చేసుకోకపోతే..తగిన శిక్షణ ఆమెకు లభించకపోతే...ఆమె పాశ్చాత్య అలవాట్లకు ఎరగా ఉపయోగపడుతుంది.ఆమె అగ్ని వంటిది.దాన్ని సరిగ్గ ఉపయోగించకపోతె ఇంటినే కాల్చివేస్తుంది.
మహిళలు తమ బాధ్యతను,ప్రత్యేకతను గుర్తించనందువల్ల, పురుషుల మాదిరిగా డ్రెస్స్ వేసుకోవాలని,చీరలు మాని,స్కర్ట్స్ ధరించాలని,ఆధునికంగా వుండాలనే భావనతో బాయ్ ఫ్రెండ్స్ వుండి తీరాలని,బ్యూటీ పార్లర్లో సింగారించకపొతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారోనని,పబ్ లకు వెళ్ళి త్రాగి,డ్యాన్స్ చేయకపొతే పాతకాలం నాటిదని అనుకుంటారని స్కూళ్ళలో, కాలేజీలలో ఆడపిల్లలు తమ మెదళ్ళలో నింపుకుంటున్న సంఘటనలు అంతకంతకు పెరుగుతున్నాయి...
హక్కులు,పెత్తనం,అహంకారం వంటివి స్త్రీ జీవితానికి కీడు తలపెడుతున్నాయి.
పురుషులు స్త్రీలో వున్న శక్తులను గుర్తించి ఆమెను గౌరవించాలి..తగిన మార్గంలొ కలిసి పయనించాలి.
స్త్రీ లో వున్న శక్తులేమిటి?
తల్లిగా వ్యక్తిత్వం పెంచుతుంది..సంపదనిచ్చి సంతృప్తి నిస్తుంది..సమన్వయంతో అందరి మనసులను గెలుస్తుంది..మంచి జ్ఞాపకశక్తి కలిగి కుటుంబాన్ని నడుపుతుంది..మేధస్సు కలిగి సమస్యల్లో కూడా
రాణించి,పరిష్కారం చూపుతుంది.ఓర్పు కలిగి కష్టాలొచ్చినా బాధ్యతను మరువదు. క్షమా గుణం ఆమెకు భగవంతుడు ఇచ్చిన వరం..దీంతో కుటుంబ సభ్యులెవ్వరైనా తప్పులు చెస్తే క్షమించి,మంచి మార్గం చూపుతుంది..
స్త్రీ శక్తి ని అధ్యయనం చేసి సమాజ శ్రేయస్సు కి స్త్రీ ప్రాధాన్యతను గుర్తించిన ధర్మం మన హిందూ ధర్మం..
- అప్పాల ప్రసాద్

1 comment: