Breaking News

భారతీయ మహిళ-2


ఈ చిత్రంలో వున్న మహిళ చాలా మందికి తెలియకపోవచ్చు. ఈమె పేరు బెట్టి ఫ్రైడన్.. పాశ్చాత్య దేశాల్లో మహిళల పట్ల చర్చ్ విధించిన అతి కఠినతర నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమించింది.హక్కులు సాధించటంలో కొంత విజయం సాధించింది కాని ఎంతో కోల్పోయానని తానే చెప్పుకొచ్చింది.
మహిళల పట్ల అక్కడి సమాజం ఎంత వివక్షతతో వ్యవహరించిందో ప్రపంచానికి తెలుసు..బెట్టి ఫ్రైడన్ సాగించిన ఉద్యమం వల్ల స్త్రీకి సమాన హక్కులు కొంత లబించాయి..కాని గమ్మత్తేమిటంటే సామాజిక విలువలు,గౌరవం,నైతికత లేని విశృంఖల స్వేచ్చకు దారి తీసింది.దాంతో ఆమె తీవ్ర అవేదనకు గురైంది..
ప్రపంచంలో ఒక వైపు బురఖా చాటున దాగిన మహిళా శక్తి,మరో వైపు దుర్వినియోగమై,నిర్వీర్యమవుతున్న స్త్రీల అంతర్ శక్తి---ఇదంతా చూస్తుంటే ప్రకృతిని సరిగ్గా అర్థం చేసుకోని పాశ్చాత్య,అరబ్ దేశాలు...
ఈ చిత్రంలో మరొక భారతీయ మహిళ వుంది.దీపం ముందుంచి ఆమె తన ఆత్మను తాను తెలుసుకుని,వెలిగిపోతుంది.
మన ఋషులు బృహదారణ్యకోపనిషత్ లో 'ఆత్మ ఒకటే...పురుషుడైనా..స్త్రీయైనా ఇద్దరిలో వుండే బ్రహ్మం ఒక్కటే ' అని చెప్పి, సమానత్వం కాదు..ఇద్దరూ ఒక్కటే అనే ఏకత్వాన్ని చెప్పటం మానవ సమాజంలోనే సంఘర్షణ లేని సమన్వయానికి మార్గం చూపించారు.
ఆ భావన లోనుండే వచ్చింది శివపార్వతుల అర్థనారీశ్వర తత్త్వం...
ఇంగ్లీష్ విద్య నేర్చి,అమెరికా దేశాలను కాపీ కొట్టే వారికి,మహిళల్లో దాగి వున్న శక్తి అర్థం చేసుకోలేరు.స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, బాలికా జననాల పట్ల వివక్షతలు,పురుష అహంకారాలు, స్త్రీ,పురుషులు తమలో వున్న ఆత్మ శక్తిని చూడలేక,భౌతిక సుఖాలకోసం వెంపర్లాటలు -- ఇవన్ని కలిసి స్త్రీ వేదనకు గురవుతున్నది.కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి.
పాశ్చాత్య పోకడలు సినిమాల ద్వారా,సీరీయళ్ళ ద్వారా,సోషల్ మీడియా ద్వారా గ్రామాల్లోకి,పాఠశాల విద్యార్థుల మనసుల్లోకి విస్తరిస్తున్నది..
ఇది ఆగాలంటే... అమ్మ ప్రేమను,దుర్గా నవరాత్రుల ఉద్దేశ్యాన్ని,ఉపనిషత్తుల కథలను మన కుటుంబాల్లో చెప్పాలి..ఇది ఒక పనిగా నిత్యం బోధించాలి...
-అప్పాల ప్రసాద్.

1 comment: