మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలచియుండేదాక
రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
రచన: శంకరంబాడి సుందరాచారి.
మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
ReplyDeletetelugu talliki jai
ReplyDeletethanks for sharing
ReplyDeletethanks for downloading the song. Visit again
DeleteBagundi...
ReplyDelete