Breaking News

భారతీయ మహిళ-3


స్త్రీని అగౌరవపరిచిన ప్రభుత్వాలు పతనమైన సందర్భాలెన్నో?

సీతను అవమానిస్తే..రావణుడికి ఏమి జరిగింది? సంహరించబడ్డాడు.

ద్రౌపదిని భంగపరచబోతే..కౌరవ రాజ్యం అంతరించింది.

పాశ్చాత్య దేశాల్లో మహిళ ను ఉపయొగించుకున్నారు.

మన దేశంలో మహిళ ప్రధాన పాత్ర ను పోషించింది.

అందుకే స్త్రీని శక్తి అనీ,దేవత అని పూజిస్తాం. రామక్రిష్ణ పరమ హంస ,తన భార్యను పూలతో పూజిస్తూ దైవంగా భావించాడు.

ఆడపిల్లలకు 'కన్యా పూజ ' చేసి గౌరవిస్తాం.

వివాహితలకు 'సుమంగళి పూజ ' చేస్తాం'

పురుషులను పూజించము..

అందుకే స్త్రీ విలువైంది.ఆమె రక్షించబడాలి.ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా వుండాలి. ప్రభుత్వంలోని మంత్రులకు పొలీస్ రక్షణ ఎలా వుంటుందో, ఆడబిడ్డ కుటుంబానికి కావల్సిన అసలైన వజ్రం.ఆమెకు రక్షణ మాత్రమే కాదు..గౌరవం కూడా లభించాలి.

పాశ్చాత్య దేశాల్లో నిజంగా ఎవరికి విముక్తి లభించిందని మీడియా ప్రచారం చేస్తుంది? సినీ తారలకు,మోడల్స్ కీ ,అందాల పావురాల కీ లభించిన ప్రసార సాధనాల ద్వారా లభించే ప్రచారం వల్ల, స్త్రీల వ్యక్తిత్వాన్ని,గౌరవాన్ని,ఆరాధనను తగ్గించి వేశాయి.ఆ దేశాల్లో విముక్తికి ప్రతిబింబం బట్టలు విడిచిన 'మడొనా యే '..ఆడవాళ్ళు వినియోగవాదం వైపు పరుగులు తీసి,ఆర్థిక జీవులుగా,బయోలాజికల్ యూనిట్ గా మిగిలిపోయారు. సాంస్కృతిక యూనిట్ అనే విషయం మరిచిపొయారు.

అమెరికా మహిళకున్న స్వేచ్చ మన భారతీయ మహిళలకుండాలి అని వాదించడమంటీ అర్థం ఏమిటి?

పిల్లలను,వృద్ధులను అనాధలుగా సమాజంలోకి విసిరివేసే సామాజిక చిత్రాన్ని తయారు చేయవద్దు.మన టి వి సీరియల్లోని కథలు,సినిమాలు,పాటలు ఇవన్నీ మహిళలను కించ పరిచేవిగా వుంటున్నాయి.వారిని వ్యాపారంగా ఉపయోగించుకుంటున్నారు.

స్త్రీలకు అక్కడి అనుభవాలు పాఠాలు నేర్పిస్తున్నాయి.ఆ దేశాల్లోని ధనిక కుటుంబాలకు చిన్మయ మిషన్,రామక్రిష్ణ మిషన్,రవిశంకర్ గురూజి,జుగ్గి వాసుదేవ్ వంటివారు చెప్పే భారతీయ ఆధ్యాత్మిక ప్రవచనాలు నచ్చి శిష్యులవుతున్నారు.

1925 వరకు వోటింగ్ హక్కులు లేక పాశ్చాత్య మహిళలు,సమానత్వం కోల్పోతే, మన దేశంలో మాత్రం అసలు ఆ చర్చనే లేదు.పైగా 1947 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత,ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్య మంత్రి శ్రీమతి సుచేత కృపలాని..అంటే విదేశీయులకు ఆశ్చర్యం వేస్తుంది.మనకు ఇది మామూలు విషయమే..

ఒకవేళ మన దేశంలో మహిళలు ఇంట్లో వున్నంత మాత్రాన గౌరవానికి లోటేమీ లేదు. పబ్లిక్ లైఫ్ కంటే కూడా కుటుంబం అత్యంత ప్రాధాన్యతగలదిగా మనం భావించటమే కారణం.

స్వీడన్ లో కుటుంబాలు వదిలి,పబ్లిక్ జీవితంలో పురుషులపై పెత్తనం చేస్తారు.అన్ని ఆర్థిక రంగాల్లో ముందున్నారు..దాని ఫలితం ఎలా వుంది మరి.? 55 శాతం పెళ్ళిళ్ళు కాకముందే పిల్లలు పుడతారు.అధికారముంది..కాని ...సామాజిక జీవనంలో గౌరవం తగ్గిపోయిందక్కడ.
-అప్పాల ప్రసాద్.

1 comment: