Breaking News

భారతీయ మహిళ-4


మహిళలను చిన్నచూపు చూసిన కారణంగా,చర్చ్ కి వ్యతిరేకంగా ఉద్యమించారు..దాంతో ఆ ఉద్యమాలు మహిళలను మరింత అగాధంలోకి త్రోసివేశాయి.
వివాహాలు చేసుకుని, సంవత్సరం లోపునే విడాకులు తేసుకునే వారి శాతం 50 శాతం..
రెండవసారి వివాహం చెసుకుని, సంవత్సరంలోపునె మళ్ళీ విడాకుల శాతం 60 శాతం.
మూడవసారి వివాహాలు,సంవత్సరపులోపునే విడాకుల శాతం 75 శాతం.
మహిళలు వివాహాలు ఇష్టపడక వివాహాలు చేసుకోవటం తక్కువైంది.
ఎక్కువలో ఎక్కువ కేవలం పురుషులతో సహజీవనం గడుపుతారు.
దాని ఫలితం ఏమిటి?
గృహాల విచ్చిన్నం,కుటుంబాలు లేకపోవటం,ఒక తల్లి లేదా ఒక తండ్రి తో జీవించే పిల్లలు,
10 వ తరగతి ఆడపిల్లలు,పెళ్ళి కాకముందే , తల్లులుగా మారిపోవటం,
ముసలి తల్లిదండ్రులను పట్టించుకునే నాధుడే లేని దుస్థితి,
తల్లి,తండ్రుల మధ్య జీవించని కారణంగా,పిల్లలు మితిమీరిన స్వేచ్చతో,అసాంఘిక కార్యకలాపాల వల్ల, ప్రభుత్వాలకు తలనొప్పులు,శాంతిభద్రతల కోసం మితిమీరిన ఖర్చులు,
ఇవన్నీ చూస్తుంటే ..హక్కులు లేని పరిస్థితులనుండి..అతి ఎక్కువ హక్కులు పొందే స్థాయికి పెరిగి,పెనములోంచి,పొయ్యిలో పడ్డట్లుగా మహిళలు తమ జీవితాలను దిగజార్చుకున్నారు.
అక్కడి మహిళలతో,మన భారతీయ స్త్రీలను పోలుస్తూ,స్వేచ్చ పేరుతో విశృంఖలతను ప్రొత్సహించే మన దేశంలోని విదేశీ మానస మేధావులను ఏమని పిలవాలి?
-అప్పాల ప్రసాద్.

1 comment: