Breaking News

భారతీయ మహిలకు చెయ్యెత్తి దండం పెడదాం-2


యశోధర..బుద్ధుని భార్య..బుద్ధుడు,యశోధర ను పెళ్ళి చేసుకున్న తరువత ఒక కొడుకు జన్మించిన తరువాత బుద్ధుడు సన్యసిస్తాడు.అప్పుడు యశోధర పరిస్థితి ఎలా వుంతుందో వూహించండి.అయినప్పటికినీ తన కొడుకుకి తగిన విద్యా బుద్ధులు నేర్పి పెద్దవాణ్ణి చేస్తుంది.గృహస్థ ధర్మన్ని చక్కగా నిర్వహిస్తుంది.
సంఘమిత్ర...బౌద్ధాన్ని స్వీకరించిన రాజు అశోకుడు,తన కొడుకు మహేంద్రున్ని,కూతురు సంఘమిత్రను బౌద్ధ మత ప్రచారానికి నియమిస్తాడు..సంఘమిత్ర సింహళ దేశంలో బౌద్ధ మత సూక్తులను స్థంభాలపై చెక్కిస్తుంది.
ఉభయభారతి...ఆది శంకరుడు, మరియు తన భర్త మండన మిశ్రుడి మధ్య పండిత గోష్టి జరిగినప్పుడు,తాను న్యాయమూర్తిగా వ్యవహరించి తగిన తీర్పు చెప్పిన న్యాయకోవిదురాలు ఉభయభారతి.
సుజాత...బుద్ధుడు తపస్సు చేస్తూ తన శరీరం కృశించిపొతున్నప్పుడు, అతనిని సేవించడానికి సుజాత సతతం కృషి చేసింది.ఆమె సేవలవల్ల బుద్ధుడు సేవ దీరాడు.
రుద్రమదేవి..కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన ప్రతాపరుద్రుని తరువాత రుద్రమదేవి రాజ్యమేలింది.ఓరుగల్లు కోటను తీర్చిదిద్దింది.శైవ,వైష్ణవుల మధ్య అంతరాలను తొలగించే ప్రయత్నం చేసింది. దేవాలయాలను సక్రమంగా నడిచేట్లు చేసింది..మచిలీపట్నం,స్రికాకుళం వద్ద రెవులను తీర్చి దిద్ది,సముద్రవ్యాపారాన్ని ప్రోత్సహించింది. గ్రామాల్లో చెరువుల త్రవ్వకంతో వ్యవసాయానికి తోడ్పడింది.చలివేంద్రాలను నిర్మించి బాటసారులకు సేద తీర్చింది.వైద్యసహాయాన్ని అందించింది.
ఝాన్సి రాణి...1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో ఆంగ్లేయులను మూడుచెరువుల నీళ్ళు త్రాగించిన వీరవనిత..వ్యక్తిగత ఆకాంక్షల కంటే దేశహితమె ముఖ్యమని భావించింది.
-అప్పాల ప్రసాద్

1 comment:

  1. భారతీయ మహిలకు చెయ్యెత్తి దండం పెడదాం-2

    ReplyDelete