Breaking News

భారత జాతీయ వాద ఉద్యమాలు


ప్రభుత్వ సంస్థలలో ప్రాతినిధ్యం, తమ వాణిని వినిపించే అవకాశం, శాసనాలను రూపొందిచడంలోనూ భారతదేశ పరిపాలనా వ్యవహారాలలోనూ ఓటు సంపాదించడం లాంటివి కాంగ్రెసు సభ్యులలో జాతీయవాదానికి అంకురార్పణ చేశాయి. కాంగ్రెసు వాదులు తమను తాము స్వామిభక్తులుగా భావిస్తూ, బ్రిటిషు సామ్రాజ్య భాగంగానే, తమ దేశ పరిలపాలనలో భాగస్వామ్యాన్ని ఆశించారు. దాదాభాయి నౌరోజి, బ్రిటిషు వారి హౌస్ ఆఫ్ కామన్స్ కు పోటీచేసి గెలిచిన మొదటి భారతీయుడిగా, ఈ ఆలోచనావిధానానికి ఒక మూర్తిభవించిన ఉదాహరణగా నిలిచారు.

బాల గంగాధర తిలక్ మొదటిసారిగా "స్వరాజ్య" వాదాన్ని వినిపించిన జాతీయవాది. తిలక్ భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను నిర్లక్ష్యం చేస్తూ, కించపరిచేదిగా ఉన్న బ్రిటిష్ విద్యావ్యవస్థను తీవ్రంగా నిరసించాడు. జాతీయ వాదులకు భావ ప్రకటనా స్వాతంత్ర్యం లేక పోవడాన్ని సహించలేకపోయాడు. సామాన్య భారతీయుడికి తమ దేశపు వ్యవహారాలలో ఏ విధమైన పాత్ర లేకపోవడాన్ని కూడా నిరసించాడు. వీటన్నిటినీ అధిగమించడానికి "స్వరాజ్యమే" సహజమైన, ఏకైక మార్గమని నమ్మాడు. "స్వరాజ్యం నా జన్మహక్కు" అనే ఆయన నినాదం భారతీయులందరికి స్ఫూర్తిదాయకమైంది.

తిలక్ మార్గాలు అతివాద మార్గాలుగా భావింపబడ్డాయి. ప్రజలు, బ్రిటిషు వారిపై తిరుగబడటమే స్వరాజ్య సాధనా మార్గంగా భావించారాయన. బ్రిటిషు వారివైన అన్ని వస్తువులను త్యజించాలని పిలుపునిచ్చారు. బిపిన్ చంద్ర పాల్, లాలా లజపతి రాయ్ వంటి వర్ధమాన ప్రజానాయకులు ఆయనను సమర్ధించారు. ఈ ముగ్గురూ "లాల్, బాల్, పాల్"గా ప్రసిధ్ధులు. భారత దేశపు అతి పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, బెంగాల్, పంజాబులు భారత ప్రజల ఆకాంక్షలకు, జాతీయవాదానికి రూపురేఖలను కల్పించాయి.

హింస, అవ్యవస్థలను తిలక్ ప్రోత్సహిస్తున్నారని గోఖలే విమర్శించారు. కాంగ్రెసులో ప్రజా ప్రాతినిధ్యం లేనందున తిలక్ ఆయన అనుయాయులు కాంగ్రెసును విడువవలసి వచ్చింది. దీనితొ కాంగ్రెసు 1907లో రెండు ముక్కలయింది.

తిలక్ అరెస్టుతో భారతీయ తిరుగుబాటుపై అన్ని ఆశలు అడుగంటాయి. కాంగ్రెసు ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. రాబోతున్న రాజ్యాంగ సవరణలలో మినహాయింపులను, ప్రభుత్వ ఉద్యోగాలలోను, నియోజకవర్గాలలోనూ ప్రత్యేక గుర్తింపును కోరుతూ ఒక ముస్లిమ్ ప్రతినిధి దళం వైస్రాయి గిల్బర్ట్ ఇలియట్-ముర్రే-కైనమండ్, 4వ మింటొ Earl(1905-10)ని కలిసింది. బ్రిటిషు ప్రభుత్వం వారి కొన్ని కోరికలను మన్నిస్తూ, ముస్లిములకై ప్రత్యేకించిన ప్రతినిధిత్వ స్థానాలను పెంచిందిభారత ప్రభుత్వ శాసనము 1909. ముస్లిమ్ లీగ్, హిందువులతో నిండిన కాంగ్రెసు నుండి తాము వేరని, తమ వాణి "దేశంలో దేశంయొక్క" వాణి అని నొక్కి చెప్పింది.

బెంగాల్ విభజన
ప్రధాన వ్యాసం: బెంగాల్ విభజన(1905)

ప్రాంతీయ మరియూ రాష్ట్రీయ రాజకీయాలపై బెంగాలీ సంస్థానంలోని హిందూ మేధావుల ప్రభావం చాల ఎక్కువగా ఉండేది. జనాభా ఎక్కువగా ఉన్న ఈ చాలా పెద్ద సంస్థానాన్ని పరిపాలనా సౌలభ్యం పేరుతో, అప్పటి వైస్రాయి, గవర్నర్-జనరల్ (1899-1905) అయిన కర్జన్ రెండు భాగాలుగా చేయాలని ఆదేశించాడు. దరిమిలా ఢాకా రాజధానిగా, అస్సాంతో చేరి తూర్పు బెంగాలు, అప్పటికే బ్రిటిషు రాజధానిగా ఉన్న కలకత్తా రాజధానిగా పశ్చిమ బెంగాలు ఆవిర్భవించాయి. ఈ ఆదేశం పై బెంగాలీలు మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా వీధి వీధినా ఉద్యమాలు జరిగాయి. పత్రికల ద్వారా ఆ ఉద్యమాలకు ప్రాచుర్యం లభించింది. ప్రజాభీష్టానికి విరుధ్ధంగా, వారి భావాలకు విలువనివ్వకుందా చేసిన ఈ పని బ్రిటిషు వారి "విభజించి పాలించే" పద్దతికి అద్దం పట్టింది. కాంగ్రెసు "స్వదేశీ" నినాదాన్నిచ్చి, బ్రిటిషు వస్తువుల బహిష్కారానికి పిలుపునిచ్చింది. ప్రజలు ఒకరికొకరు రక్షాబంధనాలను కట్టుకొని తమ సమైక్యతను ప్రదర్శించారు. ఈ రోజుల్లో రవీంద్రనాధ టాగోర్ దేశభక్తి గీతాల్ని రచిస్తూ, ఆలపిస్తూ ప్రజలను ముందుకు నడిపారు.

బెంగాలు విభజనకాలంలో కొత్త పద్దతులలో ఉద్యమాలు జరిగాయి. ఇవే స్వదేశీ, బహిష్కరణ మార్గాలు. కాంగ్రెసువారి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం, సిపాయిల తిరుగుబాటు స్థాయిలో బ్రిటిషు వారిపై ప్రజా వ్యతిరేకతను పెంచగలిగింది. హింస, అణచివేతల చక్రభ్రమణం దేశంలో పలుచోట్ల జరిగింది (చూడుడుఅలీపూర్ విస్ఫొటం). బ్రిటిషు వారు ఈ సంకట స్థితిలో నుండి బయటపడడానికి కొందరు మితవాదులకు రాజాస్థాన, సంస్థాన పదవులు ఇచ్చి, 1909లో కొన్ని రాజ్యాంగ సవరణలను తెచ్చారు. ఐదవ జార్జి రాజు 1911లో జరిపిన,బ్రిటిషు వారు సుహృద్భావ పర్యటనగా భావించే పర్యటనలో దర్బారు (దాసులు సార్వభౌమునికి విధేయతను ప్రకటించే నిండు పేరోలగం)లో బెంగాల్ విభజన రద్దును, రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి దక్షిణాన ఒక పధకం ప్రకారం నిర్మింపబడుతున్న నగరానికి మార్పును ప్రకటించాడు.

23 డిసెంబరు 1912న రాజధాని మార్పు సందర్భంగా జరిగిన సంబరాలలో వైస్రాయి లార్డ్ హర్డింగ్ పై జరిగిన హత్యాప్రయత్నం ఢిల్లీ-లాహోర్ కుట్రగా చరిత్రకెక్కింది.

1 comment:

  1. భారత జాతీయ వాద ఉద్యమాలు

    ReplyDelete