భారతీయ ప్రతిజ్ఞ
జనగణమన, వందేమాతరం తర్వాత అంతే సంఖ్యలో రోజూ లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్న ‘ప్రతిజ్ఞ’ ను రచించింది పైడిమర్రి సుబ్బారావు. ఈయన సుప్రసిద్ధ ఆంధ్రుడు. జాతీయ పతాక రూపకర్త "పింగళి వెంకయ్య" తెలుగువారే, జాతీయ ప్రతిజ్ఞ రచించింది "పైడిమర్రి సుబ్బారావు" మన తెలుగువారే.
కొత్త రూపం:
భారతదేశం నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.
నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.
పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు
పాత రూపం:
భారతదేశము నా మాతృభూమి.
భారతీయులందరు నా సహోదరులు.
నేను నా దేశమును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము.
దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును.
నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును.
నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.
ప్రస్తుతరూపంలో చేసిన ప్రధానమైన మార్పు "అర్హుడనగుటకై" స్థానంలో లింగతటస్థతను సూచించే "అర్హత పొందడానికి" అనే పదాలను చేర్చడం. దానితోబాటుగా భాషను వాడుకభాషకు దగ్గరగా ఉండేటట్లు సరళీకరించినట్లు కూడా గమనించవచ్చు.
తెలుగులో మొట్టమొదటిసారిగా లెనిన్ గారు ప్రతిజ్ఞ ను పాట రూపంలో మనకు అందించారు. పాటను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.
ReplyDeleteGreat
ReplyDeletethanks for sharing
ReplyDeleteInspiring.
ReplyDeleteInspiring.
ReplyDelete:)
DeleteThank you Lenin sir
ReplyDeleteThank you Lenin sir
ReplyDelete