Breaking News

అంతరిక్ష పితామహుడు-విక్రమ్ సారాభాయ్‌

జననం: ఆగష్టు 12, 1919
మరణం: 30, 1971



విక్రం సారాభాయ్‌ గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో అంబాలాల్‌ సారాభాయ్‌, సరళాదేవి దంపతులకు ఎనిమిదవ సంతానంగా జన్మించారు. అంతరిక్ష పరిశధనలు, బిజినెస్‌లో ప్రొఫెషనల్‌ కోర్సుల ఆవశ్యకతను ఈ మేధావి అందరికంటే ముందుగానే పసిగట్టారు.

గుజరాత్‌ కాలేజ్‌లో మెట్రిక్యులేషన్‌ పాసైన సారా భాయ్‌ ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్‌ వెళ్లారు. కేంబ్రిడ్జ్‌లో నేచురల్‌ సైన్స్‌ చదివిన ఆయన తరువాత కాలంలో సర్‌ సివి రామన్‌ వద్ద కాస్మిక్‌ కిరణాలపై అధ్యయనం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం పూర్తి కావడం భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక ఆయన మళ్లిd ఇంగ్లండ్‌ వెళ్లి పిహెచ్‌డి పూర్తి చేశారు. ఇండియాకు దిరిగి వచ్చాక దేశానికి సైన్స్‌ అవసరాలను గుర్తించిన ఆయన తన సొంత డబ్బుతో ఫిజిక్స్‌ లేబొరేటరీని ఏర్పాటు చేశారు. అక్కడే అటామిక్‌ ఎనర్జీ, భౌతిక శాస్త్రం, సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌పై పరిశోధనలు చేశారు.

అంతరిక్షంపై అమెరికా, రష్యాలు పోటీపడుతున్న తరుణంలో మనం కూడా ఆవిధంగా ముందుకెళ్లాలనే ఆలోచనతో హోమీబాబాతో కలిసి స్పుత్నిక్‌ను రూపొందించారు. ఇద్దరూ కలిసి రాకెట్‌ లాంచిగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయడం తరువాత కాలంలో ఇది ఇస్రోగా మారింది. సారాభాయ్‌ 1966లో నాసా అధికారులతో పలు దఫాల చర్చల తరువాత శాటిలైట్‌ ఇన్‌స్ట్రక్షనల్‌ టెలివిజన్‌ ఎక్స్‌పర్‌మెంట్‌ను 1975- 76లో పూర్తి చేశారు. శాటిలైట్‌ కోసం ఎంతో కృషి చేసిన ఆయన దానిని చూడలేకపోయారు.

భారతదేశపు మొట్టమొదటి ఉప గ్రహం ఆర్యభట్ట రూపకల్పన కోసం అహర్నిశలు శ్రమించారు. ఆర్యభట్ట 1755లో రష్యా సహకారంతో విజయవంతంగా అంరిక్షంలో ప్రవేశపెట్టారు. అయితే సారాభాయ్‌ అప్పటికే మృతిచెందారు. కేరళలోని తుంబాలోని రాకెట్‌ సెంటర్లో కొత్తగా నిర్మించిన ఈక్వటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవం చేశారు. కొన్ని రోజులు అక్కడే గడిపిన ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో 52 ఏళ్ల వయసులో 1971 డిసెంబర్‌ 30న అక్కడే మరణించారు. ఇస్రో ఏర్పాటులోనూ, భౌతిక, అంతరిక్ష పరిశోధనల్లో ఎనలేని సేవలు చేసిన ఆయనకు 1962లో శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు వరించింది. తరువాత 1966లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ 1972లో ఆయన మరణించాక పద్మ విభూషణ్‌ ప్రకటించింది.

1 comment:

  1. భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ కు ఆద్యుడు విక్రం సారాభాయ్.

    ReplyDelete