యల్లాప్రగడ సుబ్బారావు
జననం: జనవరి 12, 1895-భీమవరం
మరణం: ఆగష్టు 9, 1948
భారతదేశానికి చెందిన వైద్యశాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి సుబ్బారావు, తన జీవితాన్ని వైద్యశాస్త్ర పరిశోధనలకే అంకితం చేశారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుంచి డిప్లమా పొందిన తర్వాత హార్వర్డ్‌లో తనకు వచ్చిన ఆచార్య పదవిని తిరస్కరించి లెదర్లే ప్రయోగశాలలో చేరాడు. ఆయన రూపొందించిన హెట్రజాన్ అనే డ్రగ్ ప్రపంచ ఆరోగ్యసంస్థచే ఫైలేరియాసిస్ (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగపడింది.
సుబ్బారావు పర్యవేక్షణలో బెంజమిన్ డుగ్గర్ 1945లో ప్రపంచంలోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అయిన అరియోమైసిన్‌ను కనుగొన్నారు. సుబ్బారావు సహచరుడు గెట్రూడ్ ఎలియాస్‌తో కలిసి వైద్యశాస్త్ర నోబెల్ బహుమతి పంచుకొన్న జార్జి హిచ్చింగ్స్ అభిప్రాయం ప్రకారం, కొందరు అసూయతో సుబ్బారావు చేసిన పరిశోధనలను వెలుగు చూడనీయలేదు. దానివలన సుబ్బారావు కనుగొన్న కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులు తిరిగి కనుగొనవలసి వచ్చింది. 1947లో అమెరికా పౌరసత్వానికి అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతం భారతీయ పౌరుడుగానే ఉండిపోయాడు.
No comments