నవరాత్రి సందేశం - Durgamma Songs in Telugu
రచన - అప్పాల ప్రసాద్
నవరాత్రి సందేశం - నవదుర్గా జయనాదం
సగుణశక్తి ఏకత్వం -విజయానికి సంకేతం
అధర్మంపై ధర్మం,
అజ్ఞానంపై జ్ఞానం,
భయం పైన ధైర్యం,
వివక్షతపై సమత ,
స్వార్థంపై సేవా,
నిరాశపైన ఆశ,
అలసత్వంపై కర్తవ్యం,
గర్వంపై వినయం
సంఘర్షణ మార్గంలో
సాధించే విజయమిది
నవరాత్రి సందేశం - నవదుర్గా జయనాదం
సగుణశక్తి ఏకత్వం -విజయానికి సంకేతం
సహనంలో శైలపుత్రి
బ్రహ్మచారిణీ తపస్సు
ధైర్యంలోచంద్రఘంటా
సృజనాత్మక కూష్మాండం
మాతృప్రేమ స్కందమాత
ధర్మరక్ష కాత్యాయనీ
నిర్భయమౌ కాళరాత్రి
పవిత్రతా మహాగౌరి
జ్ఞానంలో సిద్ధిదాత్రి
నవరాత్రి సందేశం - నవదుర్గా జయనాదం
సగుణశక్తి ఏకత్వం -విజయానికి సంకేతం
చండ ముండ
ధిక్కారం
నిషుంబశుంభ
హుంకారం
రక్త బీజ
అహంకారం
మహిషాసురుని
మదోన్మత్తం
దేవతల పీడించే
రక్కసుల క్రౌర్యం
వికృతి చేష్టలతో
ప్రకృతిపై విధ్వంసం
త్రిమూర్తులే శక్తినిచ్చె
ఆదిశక్తి అవతరించె
దుష్టశక్తి దునుమాడి
మ్రోగించే జయభేరి
నవరాత్రి సందేశం - నవదుర్గా జయనాదం
సగుణశక్తి ఏకత్వం -విజయానికి సంకేతం
No comments