నవ దుర్గా హారతి - Nava Durga Harathi Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
మంగళ హారతి.. ఓ నవ దుర్గా
జయ మంగళమూ జయ దుర్గా
శుభ మంగళమూ జయ దుర్గా
శైలపుత్రివీ -వృషభ వాహిణీ
కమలపుష్పం ,త్రిశూల ధారిణి
ధృడ సంకల్పం అందించమ్మా
కష్టములున్నా - ధైర్యమునిమ్మా
మంగళ హారతి.. ఓ నవ దుర్గా
జయ మంగళమూ జయ దుర్గా
శుభ మంగళమూ జయ దుర్గా
బ్రహ్మచారిణీ తాపసినీవే
సహనం కలిగి,పట్టును కలిగి
లక్ష్య సాధనకు శక్తినొసంగే
జపతపముల చేసే తల్లి
మంగళ హారతి.. ఓ నవ దుర్గా
జయ మంగళమూ జయ దుర్గా
శుభ మంగళమూ జయ దుర్గా
అర్థచంద్రుని బొట్టుని దాల్చి
చంద్రఘంటవై రూపం దాల్చి
దుష్టశక్తుల దుర్మార్గాలను
ఎదిరించిన ఓ ధైర్యశాలిణి
మంగళ హారతి.. ఓ నవ దుర్గా
జయ మంగళమూ జయ దుర్గా
శుభ మంగళమూ జయ దుర్గా
శ్రీ కూష్మాండా దేవీరూపం
అష్ఠభుజముల అవతారిణివి
తేజోశక్తిని మాలో నిలిపి
అమృతకలశం అందించేవు
మంగళ హారతి.. ఓ నవ దుర్గా
జయ మంగళమూ జయ దుర్గా
శుభ మంగళమూ జయ దుర్గా
మాతృప్రేమతో కరుణనొసంగి
స్కందమాతవై రక్షణ నిచ్చి
కుటుంబసభ్యుల భారం నీదే
క్షేమమునిచ్చి బ్రోవుము తల్లి
మంగళ హారతి.. ఓ నవ దుర్గా
జయ మంగళమూ జయ దుర్గా
శుభ మంగళమూ జయ దుర్గా
శ్రీ కాత్యాయిని రూపధారిణీ
న్యాయం -ధర్మం నీవెనమ్మా
శౌర్య పరాక్రమశాలివి నీవే
అన్యాయాలను ఎదిరించేవు
మంగళ హారతి.. ఓ నవ దుర్గా
జయ మంగళమూ జయ దుర్గా
శుభ మంగళమూ జయ దుర్గా
నల్లనివర్ణం విప్పిన కేశం
భయంకరమౌ కాళికమాతా
భయమునుద్రోలి జ్ఞానమొసంగి
నిర్భయరూపిణి ధైర్యమునిమ్మా
మంగళ హారతి.. ఓ నవ దుర్గా
జయ మంగళమూ జయ దుర్గా
శుభ మంగళమూ జయ దుర్గా
మనోనిర్మలం మహాగౌరీ
శ్వేతవర్ణము వస్త్రధారిణి
శాంతి, పవిత్రత మాకందించు
మంచియోచనలు మాలో ఉంచు
మంగళ హారతి.. ఓ నవ దుర్గా
జయ మంగళమూ జయ దుర్గా
శుభ మంగళమూ జయ దుర్గా
శంఖ చక్ర గద పద్మ ధారిణి
పూర్ణతనిచ్చే సిద్ధిధాత్రి
జ్ఞానం సేవా సాధన నిచ్చి
సార్థక జీవనమందించమ్మా
మంగళ హారతి.. ఓ నవ దుర్గా
జయ మంగళమూ జయ దుర్గా
శుభ మంగళమూ జయ దుర్గా
No comments