రుద్రరూపిణి వందనం - Durga Devi Songs in Telugu
రచన - అప్పాల ప్రసాద్
రుద్రరూపిణి వందనం
శక్తి రూపిణి వందనం
సంకటము దాటించు తల్లి
సంపదలు అందించు తల్లి
రాక్షసుల వధించు వేళ
క్రోధావేషం రౌద్ర రూపి
మూడు కాలాలున్నవేళ
కాంతి కిరణం నిత్యరూపి
విశ్వమంతా నియంత్రించి
ధాత్రియై వెలుగొందినావు
ప్రసన్నత,పండువెన్నెల
జ్యోత్స్నవై కురిపించినావు
జగన్మోహన సౌందర్యం
మందస్మిత ఇందురూపం
ఉపాసకుల ఉపేక్షించని
భక్తకోటి సుఖస్వరూపం
రుద్రరూపిణి వందనం
శక్తి రూపిణి వందనం
సంకటము దాటించు తల్లి
సంపదలు అందించు తల్లి
ముల్లోకముల మేలుగూర్చే
కళ్యాణిగ కీర్తి పొంది
సర్వప్రాణుల చైతన్యం
బుద్దిప్రదవై పొంగిపొరలి
అష్టసిద్దులు ముక్తికారణ
సిద్ధియై ప్రసాదించి
అమోఘమౌ వరగ్రహణం
నైరుతి యను శక్తి పొంది
చక్రవర్తుల రాజ్యమందు
రాజ్యలక్ష్మిగ పాలించి
ప్రళయకాలం సంభవిస్తే
శర్వాణిగ మట్టుపెట్టి
భూభారం మోసినట్టి
కూర్మియై ప్రసిద్ధిపొందిన
రుద్రరూపిణి వందనం
శక్తి రూపిణి వందనం
సంకటము దాటించు తల్లి
సంపదలు అందించు తల్లి
చింత శోకం సంతోషం
దుఃఖ పీడలు దీనత్వం
భీతి భ్రమలు దారిద్ర్యం
అనుగ్రహమతిఉత్సాహం
సమస్తప్రాణుల చిత్తవృత్తి
ప్రసాదించిన మహా దేవి
ఆధ్యాత్మిక, ఆధిదైవిక
ఆది భౌతిక జగత్తంతయు
పుట్టుటకు కారణమ్మై
సకల ప్రాణుల ఆకలై,
శరణాగతుల నీడవై,
విష్ణుమాయా మూలవిద్యకు
మాటి మాటి కి వందనం
జగజ్జననికి వందనం
రుద్రరూపిణి వందనం
శక్తి రూపిణి వందనం
సంకటము దాటించు తల్లి
సంపదలు అందించు తల్లి
No comments