Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 20 / 50



1953 వ సం.లో శ్రీ గురూజీ పర్యటనలో భాగంగా బెళగావి దగ్గరలోని శ్రీపంత బాళేకుంద్రి అనేచోట శిబిరం ఏర్పాటైంది. శిబిరం మొదటిరోజు సాయంత్రం సంఘస్థాన్ జరుగుతుండగా శ్రీ గురూజీ వచ్చారు. ఆ సమయానికి వివిధ గణల్లో సమత అభ్యాసం జరుగుతోంది. శ్రీ గురూజీ రావడాన్ని దూరంనుండే చూసిన ముఖ్యశిక్షక్ పద్ధతి ప్రకారం రెండుసార్లు పొడవు ఈల ఊది స్వయంసేవకులకు సంకేతమిచ్చాడు. వెంటనే అందరూ మిగిలిన కార్యకలాపాలు ఆపి, ధ్వజాభిముఖంగా తిరిగి నిలబడ్డారు. 


ఒక గణలో స్వయంసేవకులు 'చతుర్వ్యూహ' లో సంచలనం చేస్తున్నవారు , దాన్ని ఆపి మిగిలినవారిలాగే ధ్వజాభిముఖులై నిలబడ్డారు. అయితే సమతలోని నియమం ప్రకారం - సంచలనంలో ఉండనీ లేదా స్థిరంగా నిలబడి ఉండనీ - దిక్కు సమకోణంలో మారినపుడు వ్యూహమూ తనంతటతానే మారాలి. కాబట్టి ఆ స్వయంసేవకులు ధ్వజాభిముఖులైనపుడు , వారంతా వ్యూహాన్ని మార్చి ' యుగవ్యూహ' చేయాల్సిఉండింది.అయితే అలా చేయకుండా వాళ్ళు చతుర్వ్యూహలోనే నిలబడ్డారు. అది చూసిన శ్రీ గురూజీ , ఆ గణ వద్దకొచ్చి ' అరె, ఇంకా యుగవ్యూహ చేయలేదెందుకు? అనడిగారు. గణలోని స్వయంసేవకులు యుగవ్యూహ చేసిన తర్వాతే ఆయన ధ్వజం వైపు అడుగులేశారు.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. అది చూసిన శ్రీ గురూజీ , ఆ గణ వద్దకొచ్చి ' అరె, ఇంకా యుగవ్యూహ చేయలేదెందుకు? అనడిగారు.

    ReplyDelete