Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 21 / 50



1959 నవంబర్ 21,22 తేదీలలో జరిగిన మైసూరు విభాగ్ తరుణ శిబిరంలో శ్రీ గురూజీ ని కలవడానికి మాజీ ఫీల్డ్ మార్షల్ జనరల్ కె.ఎం. కరియప్ప వచ్చారు. భారతీయ జనసంఘ్ హిందీని దేశపు అనుసంధాన భాష (Link language)గా చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్న విషయానికి సంబంధించి ఆయన మనసులో ఒక ఆలోచన ఉండింది. శ్రీ కరియప్ప కు స్వయంగా ఆంగ్ల భాషమీద అభిమానం ఉండేది. జనసంఘ్ నిర్ణయం పట్ల ఆయన తన అసమాధానాన్ని శ్రీ గురూజీ ముందు వ్యక్తపరిచారు. అపుడు శ్రీ గురూజీ ' భారత్ లాంటి అనేక భాషలున్న విశాల దేశంలో , జన మానసాన్ని ఒకటిగా ఏకం చేసి ముందుకు తీసుకుపోవాలంటే ఒక సమాన అనుసంధాన భాష ఉండాలా వద్దా? ఏక జాతీయ భావనకు పుష్ఠినివ్వాలంటే ఒక అనుసంధాన భాష ఉండాల్సిన అవసరం లేదా? దేశం స్వతంత్రమయ్యాక ఏక జాతీయతను రూపొందించడానికి విదేశీ భాషను వాడటం మనకు గౌరవం కల్గిస్తుందా? హింది భాష మన దేశపు అనేక ప్రాంతాలలో వాడబడుతోంది. మిగిలిన భాషలకన్నా భిన్నంగా ఎక్కువ ప్రమాణంలో ఎక్కువ మంది సులభంగా గ్రహించగల భాష అది. హింది కి ఉన్న ఈ అనుకూలతల వల్ల నేటి సందర్భంలో దాన్ని మన అనుసంధాన భాషగా చేయడం సర్వోచితం ' అని వివరించారు. 

శ్రీ గురూజీ ఆలోచనను మాజీ ఫీల్డ్ మార్షల్ జనరల్ కె.ఎం. కరియప్ప అంగీకరించారు. ఆయన తన ఆలోచనను మార్చుకున్నారు.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. శ్రీ గురూజీ ఆలోచనను మాజీ ఫీల్డ్ మార్షల్ జనరల్ కె.ఎం. కరియప్ప అంగీకరించారు. ఆయన తన ఆలోచనను మార్చుకున్నారు.

    ReplyDelete