Breaking News

1984 నా తృతీయ వర్ష నాగపూర్

రేషంబాగ్ సంఘస్తాన్ లో 30 రోజుల శిక్షణప్రారంభం అయ్యింది. మొదటి రెండురోజులు ప్రాంతాల (స్టేట్) వారీగా గదులు ఏర్పాటు చేశారు. మాకు ప్రాంత ప్రముఖ్ గా స్వర్గీయ ఈరంకి సుబ్రహ్మ ణ్యం గారు వచ్చారు. మణి, కాశీనాథ్,పప్పు విశ్వనాథ్, పద్మనాభం, నాని, కలిడింది ప్రసాద రాజు అంతా గొడవ బాచ్. సుబ్రహ్మణ్యం గారు సీరియస్.
ఉదయం శిక్షణ లో దండ యుద్ధ, యోగా సన ఒక కాంబినేషన్, యోగచాప్, నియుద్ధ మరొకటి, ఆప్షన్ అడిగితే యోగా నాకు భయం కాబట్టి దండీయుద్ద ఇష్టమైన వదులుకొని రెండో విషయానికి వచ్చాను. మాకు సన్నటికుర్రోడు నియుద్ధ శిక్షక్. పంచింగ్(ఆఘాత్,) రోధ చెబుతుం టే ఆ శారీరక్ క్షమత అర్థం అయ్యేది. అప్పుడే ప్రచారక్ గా వచ్చారు. మళ్లీ వారిని మన అఖిల భారతీయ సహ సేవాప్రముఖ్ మాననీయ అజిత్ మహా పాత్ర. 1984 తరువాత వారిని పాతికేళ్ల తరువాత చూసాను. వారిని అడిగి వారు ఆ వర్గలో నియుద్ధ శిక్షక్ అంటే చాల సంతోషమ్ అయ్యింది.
రెండో రోజు వసతి మార్చారు. ఇద్దరు ఆంధ్ర, ఇద్దరు బెంగాలీ ఇలా అన్ని ప్రాంతాల నుండి ఇద్దరిద్దరు కలిప్పి ఒక గది లోకి మార మన్నారు. 28 రోజులూ అలాసూక్మ భారతం లో నివాసము. ఒకరి భాష ఒకరికి రాదు. ఇద్దరిద్దరు ఆయా ప్రాంత పాటలు చెబుతుంటే నవ్వుకుంటూ అర్థం కాని ఆ పాటలు వల్లే వేస్తుండే వాళ్ళం. కష్టపడి పాడుతుండే వాళ్ళం. ఒక్కో ప్రాంతం లో సంఘ కార్యక్రమాలు తెలిసికోవడానికివారధి భాష హిందీ. ప్రసాదరాజుకి కు అర్థం కాకపోతే నెను తెలుగు లో చెప్పేవాడిని.
మేము మాతృభూమి రు కారం పలికితే
బెంగాల్ వాళ్ళు నవ్వేవారు. ఎలాపలకా లంటే మాత్రి అనే ఈ కారం పలకాలని అనేవారు. హెగలు హెగలు హెజ్జ హెజ్జ జోడి గూడి నడవుయువా అని కన్నడ గీత అభ్యాసం, అలాగే ఒక ఒరియా పాట ఇలా ఖాళీ సమయం లో నేర్చుకునే. వాళ్ళమ్.

ఫోన్ ఇబ్బంది పెడుతోంది.రేపు మళ్లీ...
...
.... - నరసింహా మూర్తి.

1 comment:

  1. రేషంబాగ్ సంఘస్తాన్ లో 30 రోజుల శిక్షణప్రారంభం అయ్యింది. మొదటి రెండురోజులు ప్రాంతాల (స్టేట్) వారీగా గదులు ఏర్పాటు చేశారు. మాకు ప్రాంత ప్రముఖ్ గా స్వర్గీయ ఈరంకి సుబ్రహ్మ ణ్యం గారు వచ్చారు. మణి, కాశీనాథ్,పప్పు విశ్వనాథ్, పద్మనాభం, నాని, కలిడింది ప్రసాద రాజు అంతా గొడవ బాచ్. సుబ్రహ్మణ్యం గారు సీరియస్.

    ReplyDelete