Breaking News

RSS ప్రసిద్ది పరాన్ముఖత- నిర్మాణకార్యం ప్రాముఖ్యత


సంఘం మొదటి నుండి ప్రచారం చేసు కోవడం విషయము పక్కన పెట్టింది. ప్రారంభం ల RSS గుర్తు ఒకటి ధరించాలని ప్రతిపాదన స్వయంసేవకుల నుండి వచ్చింది. బ్యాడ్జి ఉండాలని ఇంకా రక రకాల ప్రతిపాదనలు వచ్చాయి. పూజనీయ డాక్టర్జీ అన్నీ ఓపిక గా విని మన ప్రవర్తనను బట్టి మనం సంఘ స్వయంసేవకులం అని తెలియాలి కాని పటాటోపాల వల్ల కాదని సంఘ నిర్మాత మార్గదర్శనం చేశారు. మన ప్రవర్తన, మన పలుకు, మన ఆత్మవిశ్వాసం, మన దేశ ప్రేమ మనం స్వయంసేవకులం అనిపించాలి అని చెప్పిన వారి మాటను సంఘం నిలబెట్టుకుంది.
55 వేల గ్రామాల్లో సంఘ స్వయం సేవకులు భారత మాత యజ్ఞం రోజూ జరుగుతున్నా, లక్షల గొంతులలో భారత మత జపం జరుగుతున్నా, కోట్ల గంటలు రోజూ సమాజానికి స్వచ్చందంగా సమార్పిస్తున్నా ఎక్కడా ప్రచారంలేదు. సంఘం నడపడానికి కావలసిన ఆర్ధిక వనరులు కూడా సంవత్సరంలో ఒక సారి జరిగే గురు పూజా, గురుదక్షిణ లో స్వయంసేవకులే సమర్పించుకున్నదే సరిపుచ్చుకోవడం వల్ల సమాజం లో జరిగే ఈ నిశ్శబ్ద సామాజిక కార్యకర్తల నిర్మాణ ప్రక్రియకు ప్రచారం లేదు, పత్రికా ప్రకటనలు లేవు. ఫోటోలు, రోడ్ల పై ప్రదర్శనలు లేవు.
ఇది నిర్మాణాత్మక కార్యం, దానికి ప్రచారం అవసరం లేదని సంఘ ప్రఖర నమ్మకం. రోజూ చిన్నపాటి వ్యాయామం, ప్రార్థన చేసే సంస్థకి ఫుల్ టైమర్ ఎందుకని నన్ను ఒకరు అడిగారు. వాళ్లకు అర్థం కాని నిశ్శబ్ద విప్లవం సమాజాన్ని నడిపించే, సమాజాన్ని సుదృఢ పరిచే స్వయంసేవకుల నిర్మాణం జరుగు తున్నదని, సమాజానికి తెలియదు. గాంధీజీ హత్య నాటికే మనం దేశ విభన విషాద సంఘటనలు ఎదుర్కొని హిందూ సమాజ సంరక్షణ కొన్ని చోట్ల చేయగలిగిన స్థితికి చేయూకున్నామంటే మన కార్యకర్తల చెమట ఎంత చిందిందో అర్థం అవుతుంది. దేశ విభజన సమయం.లో వారి రక్తం కూడా ఈ యజ్ఞం లో సమర్పిత మయ్యింది.
సత్యాగ్రహ ప్రభావం తో, కోర్టు తీర్పు ప్రభావం తో ప్రభుత్వం దిగి వచ్చింది. సంఘం పై నిషేధం తొలగింది. ఇంత బలం ఉండే సంస్థ గూర్చి పార్లమెంటు లో మాట్లాడిన వాళ్ళు లేరు. ప్రభుత్వం తో చట్ట సభలలో చర్చించిన వారు లేరు. ఇది స్వయంసేవకులు గురూజీ తో ఆలోచించారు. కొంతమంది రాజకీయ కార్యం కూడా చేస్తే మంచిదనే సూచనలు వచ్చాయి. చర్చించారు. అనుమతిం చారు. సంఘం ఆ పని చేయదు. ఉత్సాహం ఉన్నవాళ్ళను అనుమతించింది.
కాని ఒక విచిత్ర స్థితి ఉంది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు మనల్ని గాంధీ హంతకులుగా దూరం ఉంచారు. కమ్యూనిస్టులు దేశం, జాతీయత లేని విదేశీ పార్టీలు. మనమే వెళ్లము. ఈ పరిస్థితుల్లో నెహ్రు కాబినెట్ మినిస్టర్, కాంగ్రెస్ నాయకులు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఆ పార్టీ నుండి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టారు. దాని పేరు భారతీయ జన సంఘ్. స్వయంసేవకులు ఆ పార్టీ లో చేరారు.
తదుపరి కాలం లో శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పూజనీయ గురుజిని కలిసి ఉత్సాహంగా పని చేస్తున్న బృందానికి ఒక సయోజకులను కూడా ఇమ్మని అడిగారు. గురూజీ ఉత్తరప్రదేశ్ ప్రాంత ప్రచారక్ గా ఉన్న శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ గారిని ఇచ్చారు. అది బలమైన పక్షంగా, అఖిల భారతీయ సంస్థ గా తయారయ్యింది. ఆ విధంగా స్వయంసేవకులు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు జగన్నదరావు జోషి, అటల్ బిహారీ వాజపేయి, బలరాజ్ మధోక్, అద్వానీ లాంటి ఉద్దండులు రాజకీయ క్షేత్రానికి మార్గదర్శనం చేశారు.
తరువాతి కాలం లో అది జనతా పార్టీ లో చేరడం. ఆ పార్టీ విడిపోయి భారతీయ జనతా పార్టీ అయ్యింది. స్వయంసేవకులంతా ఆ పార్టీ లో చేరాలనే నియమం లేదు. సంఘ పని స్వయం సేవకులను తయారు చేయడమే.

విషయం చర్చించడానికి ఆహ్వానం. 
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. RSS ప్రసిద్ది పరాన్ముఖత- నిర్మాణకార్యం ప్రాముఖ్యత

    ReplyDelete