Breaking News

స్వర్గీయ శ్రీదర్జీ వనవాసులతో

ఒకసారి పాడేరు లోనిగ్రామాల్లో తిరుగుతూ ఒక గ్రామంలో బాలల వికాసం కోసం జరిగే సంస్కార కేంద్రం లో ఒక మంచి శ్లోకం, దేశ భక్తి గీతం నేర్పి, వారు శ్రద్ధగా వినేటువంటి కథ చెప్పి అందరితో కలిసి వారి లో జ్ఞాన తృష్ణ పూర్తి చేస్తున్న మన కార్యకర్తను చూసి ఒకతల్లి, బాబూ మీరు దేవుళ్ళు బాబు. మాకోసం వచ్చి మా పిల్లలకు ఇన్ని విషయాలు శ్రద్ధగా నేర్పుతున్నారు. అంటూ కళ్ళల్లో నీరు పెట్టుకుంది.
మన కార్యకర్త నవ్వి ఒక్కటి అడుగు తాను చెప్పు తల్లీ నీవు సింహాచలం చూసావా? అక్కడ ఎవరుంటారు?
నరసింహ స్వామి అంది ఆమె.
కింద ఉంటాడా? కొండమీద ఉంటాడా?
కొందకేే ఉంటాడు బాబు. జవాబు.
అన్నవరం చూసావా?
చూసాను బాబూ. సత్యనారాయణ స్వామి ఉంటాడు. 
కింద ఉంటాడా? కొండపైన ఉంటాడా?
కొండ మీదనే బాబూ
తిరుపతి పోయినావా? 
నేదు బాబూ ఎప్పుడో పోవాలి వెంకన్న ను చూడాలి. వచ్చే ఏడాది పోతాం బాబూ
మరి అయన కింద ఉంటాడా? కొండ పైన ఉంటాడా?
కొండ మీదనే బాబు. ఏడు కొండలు.
మరి దేవుడు అన్ని చోట్లా కొండకె ఉన్నాడు. భక్తులు కింద నుండి పైకి వెళ్లి చూస్తారు కదా! 
అవును బాబు..
మీరు కొండమీదఉన్నారా?క్రిందఉన్నారా? 
కొండ కె ఉన్నాము బాబు .
చూసావా దేవుడు, కొండ పైనే, మీరు కొండ పైనే. మేము కిందనుండి వచ్చాము
కాబట్టి దేవుడు మీరా?మేమా?
కొండ మీద ఉన్నవాడే దేవుడు. మరి నన్ను దేవుడు అంటావు. మేము కిందనుండి వచ్చాము. మేము భక్తులం.
మీరు కొండ పైన ఉన్నారు మీరు దేవుళ్ళు.

అంత వరకు ఈ ప్రశ్నలు ఎందుకు అడిగారో తెలియక అమాయకంగా జవాబు చెప్పిన తల్లి. ఒక్కసారి ఆశ్చర్యంతో మేము దేవుదంటావా బాబూ! అంటూ నవ్వేసింది.
ఈ సంభాషణ మన స్వర్గీయ శ్రీదర్జీ, పాడేరు కొండల్లో ఉండే తల్లి తో మాట్లాడాదంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది.
తమ జీవితాన్ని వనవాసుల బాగుకోసం సమర్పణ చేసిన సంఘ ప్రచారక్ శ్రీదర్జీ, అక్కడి జనులతో మమేకం కావడం కాదు, వారిని దేవుళ్ళు గా ఆరాధించారు.
ఆ ఆరాధన లో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. చిన్న సహకారం చేసి గొప్పగా చెప్పుకునే మనకు, వారి జీవన సమర్పణ
కొండవారిని తన దేవుళ్ళుగా ఆరాధించిన వారి తపస్సు అక్కడ పని నిలబెట్టింది. ఇప్పుడు అదొక శక్తివంతమైన కేంద్రం. విద్యార్థుల హాస్టల్, కుట్టు కేంద్రం లాంటివి నేర్పుతూనే వారి జీవితాలకి వెలుగు చూపే కేంద్రంమయ్యింది.

ఇలా ఈ సమాజాన్ని ఆరాధించే వేల జీవనాలకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్మాణం చేసింది.

నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. స్వర్గీయ శ్రీదర్జీ వనవాసులతో

    ReplyDelete