Breaking News

24 అక్టోబర్ భాగ్యనగర్ సిటీ బృహత్ పథసంచలనం జరిగింది


24 అక్టోబర్ భాగ్యనగర్ సిటీ బృహత్ పథసంచలనం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియం నుండి రెండు పథ సంచలన్లు వేరుగా బయలు దేరి రెండు కలిసి బృహత్ ప్రదర్శన జరిగింది. సంచలన తరువాత వేల మందితో దసరా ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మాననీయ కృష్ణాగోపాలజి, సంఘ అఖిల భారతీయ సహా సర్ కార్యవాహ్,మార్గదర్శనం చేశారు.
సంఘ ప్రారంభమై 92 సంవత్సరాలు అయ్యిందని, అన్ని ప్రాంతాలలో, జిల్లాలలో ఎక్కువ మండలాలలో సంఘ కార్యక్రమాలు చేరాయి. షుమారు 80 వేల ప్రదేశాల్లో సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అస్సామ్ రాష్ట్రాలలో వారు కొంత కాలం క్షేత్ర ప్రచారక్ గా పనిచేశారు. 15 వ ఆగస్టు, 26 జనవరి కూడా ఊర్లల్లో, పాఠశా్లల్లో జరుగని పరిస్థితి నుండి ఇప్పుడు అక్కడ వేల ప్రదేశాల్లో జరిగే స్థితికి సంఘ వాళ్ళ మార్పు సంభవం అయ్యిందని చెప్పారు.
వ్యక్తి వ్యక్తిని సంఘం లో చేర్చే పనిని ప్రతీ స్వయంసేవక్ ఈ సంవత్సరం లో ఒక ఐదుగురిని చేర్చే పనిని చేపట్టాలని ఉద్బోధించారు.
తోటి పౌరుడిలో, జీవకోటి లో పరమేశ్వరుణ్ణి చూసే ఈ దేశ వాసు లందరూ హిందువులని, అందరి సుఖాన్ని కోరేవాడే హిందువని, అతను ఈ దేవుడిని కొలిచినా హిందువెనని వివరించారు.
మంచివారు శాంత స్వభావులని రాక్షస లక్షణాల వారు త్వరగా కలిసిపోయి అరాచకాలు రేపుతారని, సాత్వికులు త్వరగా కలవడం కష్టం అయినా పరిస్థితి గంభీరతని గమనించినాక అన్ని సాత్విక శక్తులు ఏకమై, ఆ తామసిక శక్తిని అంతం చేస్తాయని, ఆ ఏకీకృత రూపమే దుర్గా మాత అని ఆ శక్తి మహిషాసురుని అంతమోదిస్తుందని చెప్పారు. హిందూ పద్దతిలో మాతృ శక్తే అన్ని విద్యలకు, ఆర్థిక శక్తికి, ఆసురీ శక్తిని అంతమొందించే దుర్గాశక్తి అని, యా దేవీ సర్వ భూతేషు, సర్వ శక్తేషు,అంటూ ఆ శక్తి తత్వానికి నమస్సులు అర్పించారు.
ఇంకా బౌద్ధిక్ టెక్స్ట్ వస్తుంది. కొన్ని మీ ముందుంచాను.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. సంఘ ప్రారంభమై 92 సంవత్సరాలు అయ్యిందని, అన్ని ప్రాంతాలలో, జిల్లాలలో ఎక్కువ మండలాలలో సంఘ కార్యక్రమాలు చేరాయి. షుమారు 80 వేల ప్రదేశాల్లో సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

    ReplyDelete