Breaking News

X ట్రా పబ్లిసిటీ - రోతపుట్టిస్తున్న వాణిజ్య ప్రకటనలు


వాణిజ్య ప్రకటనలు... సమాజంలో ఒక సందేశాన్ని పంపేందుకు ఉపయోగిస్తారు. అయితే, అవి సమాజ శ్రేయస్సును, సంస్కృతిని ఆకాంక్షిచేవైతే అందరి మొప్పు పొందుతాయి. కాని, నేడు వెలువడుతున్న వాణిజ్య ప్రకటనలు అత్యంత దారుణంగా ఉంటున్నాయి. మహిళను అంగడి వస్తువుగా చూపుతున్నాయి. సందేశానికి బదులు ప్రజలను ముఖ్యంగా యువతను తప్పుదారి పట్టించేవిధంగాను, రోత పుట్టించేవిగాను ఉంటున్నాయి. ముఖ్యంగా టివిల్లో వెలువడుతున్న వాణిజ్య ప్రకటనలు కుటుంబ సభ్యులతో కలిసి తిలకించే విధంగా లేనేలేవు. యుక్త వయస్సు వచ్చిన పిల్లలతో కలిసి టివీ చూస్తుండగా, అటువంటి ప్రకటనలు వస్తే కుటుంబ పెద్దల పరిస్థితి వర్ణించనలవి కాదు. వారు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అయినా అటు ప్రభుత్వం కాని, ఇటు సామాజికవేత్తలు కాని నోరు మెదపడం లేదు. గతంలో కనీసం సామజిక వేత్తలు, మహిళా సంఘాలు అడపాదడపా దండెత్తేవి. నేడు మచ్చుకు కూడా అటువంటి ఆందోళనలు కాదు కదా కనీసం నిరసన కూడా వ్యక్తం కావడం లేదు. జాతీయ స్థాయిలో వాణిజ్య ప్రకటనల ప్రసారాలపై నియంత్రణ వ్యవస్థ ఉన్నా అది మొద్దు నిద్రపోతుంది. కేవలం మద్యం ప్రకటనలకు మాత్రమే నియంత్రణ సూత్రాలను వర్తింప చేస్తున్నారు. అయితే, ఆ ప్రకటనలు కూడా పరోక్షంగా వెలువడుతూనే ఉన్నాయి. 

ఇటువంటి వాణిజ్య ప్రకటనలను వీక్షించిన టినేజర్లు ఆ తరువాత దేనిపై తమ దృష్టిని క్రెంద్రికరిస్తారు? వారి చదువులు ఏమవుతాయి? వారి భవిష్యత్ ఏమిటి? ఇప్పటికే డ్రగ్స్ తో సహా సమాజంలో విచ్చలవిడిగా మాదకద్రవ్యాల ప్రభావం యువతపై పడుతుండగా, వాణిజ్య ప్రకటనలు సమాజాన్ని భ్రస్టు పట్టిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వంతో పాటు సామాజికవేత్తలు కూడా దృష్టి పెట్టకపోతే మరింత దారుణ పరిస్థితిని ఎదుర్కొనక తప్పదు.

- సాయినాథ్ రెడ్డి.

5 comments:

  1. X ట్రా పబ్లిసిటీ - రోతపుట్టిస్తున్న వాణిజ్య ప్రకటనలు.

    ReplyDelete
  2. Should regulate the advertisements strictly..

    ReplyDelete
  3. Well said sir. it is true

    ReplyDelete