మూగ జీవి
ఏం గొడ్లో(Corrupted Politicians) ఇవి. తెగ మేస్తున్నాయి..
మూతి బుట్ట మూతికే ఉంది. గడ్డి వాము (నిధులు) మాయం.
ఏం జీతగాళ్ళో(Corrupted Officers) వీళ్ళు. తెగ కాజేస్తున్నారు.
అప్పు చేసి కొన్న గింజలన్నా అరెకరానికే సరిపోయయంటారు.
ఏం పంపుసెట్టో(System of Democracy) ఇది. తెగ ఆడుతుంది.
పొద్దుపోయిందాకా నీళ్ళు(Taxes) తోడుతున్నా పొలం ఎండిపోయే(Leakages) ఉంది.
ఏం పొలమో(Government) ఇది. తెగ పండుతుంది(Budget allotment).
నోట్లోకి మాత్రం నాలుగు వేళ్ళు(Middlemen Theft) పోయేలా లేవు.
నోరు మూసుకు పొట్ట కాల్ఛుకు
నీళ్ళు తాగుతు డొక్కలెండుతూ
ఏదోలా బతుకుదామనుకుంటే
ఒకడంటాడు పరువుపోతుందని
మరొకడు ప్రశ్నిస్తాడు సిగ్గులేదా అని
అంతరాత్మ కడిగేస్తుంది ఎదిరించలేవా అని
కడుపు మూలుగుతుంది దానికింత తిండి పడేయమని
కుటుంబం దీనంగా చూస్తుంది ఆత్మహత్య కూడా సామూహికంగానే సాధ్యమని !!
అంతలో బానపొట్ట వాడు వస్తాడు.
నలుగురి పొట్టకొట్టమంటాడు.
మరో బట్టతల వాడు వస్తాడు.
పది మందికి గుండు గీయమంటాడు.
ఇంకో నడుములు పడిపోయినోడొస్తాడు.
జనాల మీద సవారీ చేయమంటాడు.
సర్లె అనుకుని ఆ దిక్కుగా ఆలోచిస్తే!
విలువలు మొహం మీదే ఛీకొడతాయి.
వలువలు ఒంటి మీద కూడా నిలువలేమంటాయి.
చిలువల పలువల పుకార్లు గుండె తట్టుకోలేనంటుంది.
ఏం చేయాలో మరి!!!!!
-కూరపాటి పునీత్ ప్రశాంత్, ఖమ్మం.
(puneethkurapati@gmail.com).
(puneethkurapati@gmail.com).

మూగ జీవి.
ReplyDelete