ఆంగ్లేయుల కలవరం- గణపతి పండుగ సంబరం
వీధుల్లో నలుగురు కలిసి నడిస్తే,వాళ్ళను జైళ్ళో పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఆంగ్లేయుల కాలాన్ని గుర్తుకుతెచ్చుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.1894 సంవత్సరంలో అప్పటి పాలకులు అమలుచేసే చట్టాలకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారు.అందుకే ముగ్గురు,నలుగురు కలిసి బయట తిరగడానికి జంకేవారు.సామూహికంగా ఎటువంటి కార్యక్రమాలు జరపడానికి అవకాశమే లేని నియంతల కాలం.1875 లో బకించంద్ర చటర్జీ రచించిన వందేమాతర గీతం పాడితే నిర్బంధించేవారు.ఇది గ్రహించిన స్వాతంత్ర్య ఉద్యమ మహా నాయకుడు,లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఆంగ్లేయులు చేసిన చట్టాలను ఉల్లంఘించడానికి నిర్ణయించుకున్నారు.అలాగే ప్రజల్లో ఏర్పడిన భయాందోళనలను తొలగించడానికి రచించిన ప్రణాళికలోని భాగమే గణపతి ఉత్సవాలు.1894లో అక్టోబర్ 20 నుండి అక్టోబర్ 30 వరకు 10రోజుల పాటు ఉత్సవాలు జరపాలని,పూనా పట్టణంలోని శనివార్ వాడా వీధిలోని ప్రజలతో గణేశ్ ఉత్సవ మండలిని ప్రారంభించి,తిలక్ స్వయంగా గణపతిని అక్కడి మండపంలో ప్రతిష్ఠాపించారు.ఆ పదిరోజులు కూడా తిలక్ స్వయంగా పది రోజులు పాల్గొన్నారు.దానివల్ల ప్రజల మనో బలం పెరిగింది.ఆంగ్లేయులకు ఏమిచేయాలొ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటే చర్యలు తీసుకోవచ్చును కాని, మత,ధార్మిక కార్యక్రమాల్లోని ప్రజలను నిర్బంధించడం ఎలా? తిలక్ నేతృత్వంలో,గణపతి సాక్షిగా స్వాతంత్ర్య ఉద్యమం ఊపందుకుంది...."గణపతి బొప్పా మోరియా".
- అప్పాల ప్రసాద్.
ఆంగ్లేయుల కలవరం- గణపతి పండుగ సంబరం
ReplyDeleteప్రస్తుతం గణేష్ ఉత్సవాలు వీధి వీధికి పోటిగా చేస్తున్నారు. ఒక వీదిలోనే 3 నుంచి 4 విగ్రహాలు ఉన్నాయి. మనం గణేష్ ఉత్సవాల అర్థాన్నే మార్చేశారు ప్రస్తుత ప్రజలు.
ReplyDeleteవాటికి తోడు సినిమాల పాటలు. గణపతి మండపాలు వినోదానికి అడ్డాగా మారాయి. దీనికి అడ్డుకట్ట వెయ్యాలంటే ఎలా? ఎవరైనా చెప్పగలరా?
Deleteస్పందించండి మిత్రులారా?
నిజంగా మన తెలుగు రాష్ట్రాలలో అదే జరుగుతుంది. గణేష్ కమిటిలకు సూచనలు ఇస్తే ఫలితం ఉంటుంది.
Deleteకొందరు ప్రబుద్దులు అయితే కొట్టుకుంటున్నారు. ఈ రోజు పేపర్లో చూసాను. ఐకమత్యం అనేది వారికీ తెలీదు పోటిగా మండపాలు ఏర్పాటుచేస్తున్నారు.
ReplyDeleteనిజం చెప్పారు..
Delete