గణపతి ముందుండగా-కదను త్రొక్కిన విశాల భారతం
1894లో పూనా పట్టణంలోని శనివార్ వాడలొ మొదలైన సామూహిక గణేశ్ ఉత్సవాల్లొ ఉపన్యాసాల జోరు కొనసాగింది. అక్టోబర్ 20న బెంగాల్ నుండి వచ్చిన బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసం ప్రజలను ఉత్తేజితులను చేసింది.21న ఉత్తర భారతం నుండి వచ్చిన లాలా లజపత్ రాయ్ మాట్లాడుతుంటే ప్రజలు గొంతెత్తి,ఉత్సాహంతో నినాదాలు చేయటం మొదలుపెట్టారు.పునా నగరంలో ఒకే కుటుంబంలో జన్మించిన విప్లవ యోధులు ముగ్గురు అన్నదమ్ములైన దామోదర్ హరి,బాలక్రిష్ణ హరి,వాసుదేవ హరి 22న,23న,24న వరుసగా ఉపన్యసించి,యువకుల హృదయాల్లో దేశభక్తిని నింపారు.(ఆ తరువాతి కాలంలో,అంటే 1897లో ఆంగ్లేయ అధికారి "రాండ్" పై ఈ ముగ్గురు బాంబులు వేసి ఆంగ్ల ప్రభుత్వానికి సవాల్ విసిరారు.ఈ ముగ్గురికి ఆంగ్లేయ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది) గణపతి దేవుడు తమ దేశానికి స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలని,స్వరాజ్య సాధనలో గణపతి తమకు తోడుగా వుండాలంటూ వారి వారి ప్రసంగాల్లో పేర్కొంటుంటే, ప్రజలు భక్తికి దేశభక్తిని మిళితం చేసి, ప్రజలు ఎగిరి గంతేశారు.తిలక్ ఇచ్చిన స్ఫూర్తితో 1895లో పూనా నగరంలోని వీదుల్లో 11గణపతులు వెలిశాయి.
1896లో 31గణపతులు పెరిగాయి.1897లో 100 కు పైగా గణపతులు స్థాపించారు.ఆ తరువాత పూనా నగరం బయట ముంబయి,అహ్మద్ నగర్,నాగపుర్,విదర్భ మొదలైన ప్రాంతాల్లోకి సాముహిక గణపతి ఉత్సవాల సంఖ్య వందలు, వేలుగా విస్తరించాయి. బాల గంగాధర తిలక్ 1904లో ఒక ప్రకటన చేసాడు.అదేమిటంటే దేశంలోని అన్ని ప్రాంతాల్లొ గణపతి పండుగ ఘనంగా జరపాలని పిలుపునిచ్చాడు.బ్రిటిష్ వారి అడుగులకు మడుగులొత్తే పనులు చేయవద్దని,సాముహిక గణపతి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం స్వరాజ్యాన్ని సాధించటమేనని,మనము బానిసలమై వుంటే మన పండుగలు, మన డేవుళ్ళను మాత్రం ఎలా స్వేచగా ఆరాధించగలమని ప్రజలను ప్రశ్నించాడు.గణపతిని ముందు నిలిపి,స్వరాజ్యం తెచ్చుకోవడానికి నడుం కట్టమని తిలక్ ఇచ్చిన పిలుపు భారతీయులను కదిలించింది.విశాల భారతం, విశ్వరూపాన్ని దాల్చి,కదను త్రొక్కింది.
- అప్పాల ప్రసాద్.
గణపతి ముందుండగా-కదను త్రొక్కిన విశాల భారతం
ReplyDelete