Breaking News

శ్రమించండి.. సాధించండి - ప్రధానమంత్రి

ప్రధాన మంత్రి ఉపాధ్యాయ దినోత్సవ ప్రసంగం నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు.

- గొప్పవ్యక్తుల జీవితచరిత్రల్ని అధ్యాయనం చేయండి. పుస్తకాలను చదవటం చాలా మంచి అలవాటని మోడీ సూచించారు.

- కష్టపడి పని చేయాలి.. కష్టపడి ఆటలు ఆడాలి.. రోజుకు కనీసం నాలుగుసార్లయినా చెమట చిందించాలి.. రోజంతా పుస్తకాలకే అతుక్కుపోయి ఉండవద్దు" - విద్యార్దులకు ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన సందేశం.

-  బాలిక విద్య తనకు అత్యంత ముఖ్యమైన అంశమని మోడీ పునరుద్ఘాటించారు. బాలికలు ప్రతిరంగంలోనూ అద్భుతంగా రానిస్తున్నారని, వారిని చదివించటం అంటే.. అటు తల్లిగారిల్లు, ఇటు అత్తగారిల్లు - రెండు కుటుంబాలనూ చదివించినట్లేనన్నారు.

- ఈ రోజుల్లో పని అంతా గూగుల్ గురూ (గూగుల్ సెర్చింజిన్) ద్వారానే అయిపోతుంది. అయితే అది సమాచారన్నే ఇస్తుంది తప్ప జ్ఞానాన్ని కాదన్నది గుర్తుంచుకోవాలి అని హితవు పలికారు.

- దేశానికి సేవ చేయటం అంటే దేశం కోసం మరణించటమో, రాజకీయాలు చేయటమో కాదని.. విద్యుత్తును ఆదా చేయటం, పర్యావరణాన్ని కాపాడటం ద్వారా కూడా దేశానికి సేవ చేయవచ్చని విద్యార్థులకు ప్రధాని పిలుపునిచ్చారు.

జై హింద్.

- సాయినాథ్ రెడ్డి.

4 comments: