పరమాత్మ నుడువంగ ఋషులు ఘోషించగా - Vedam Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
పరమాత్మ నుడువంగ ఋషులు ఘోషించగా
చైతన్యముప్పొంగు వేదం
అజ్ఞానమునుత్రుంచివెలుగురేఖలుపంచి
జ్ఞానతృష్ణను పెంచు వేదం
(పయనించమన్నది వేదం)
ఋషిమునులు ఘోషించు వేదం
మానవత్వం చూపె వేదం
ఆత్మ చైతన్యమే వేదం
సేవ చేయాలంది వేదం
అగ్నినే రగిలించి సంకల్పబలముంచి
మనసునే కదిలించు వేదం
సన్మార్గమే చూపు వేదం
యజ్ఞమే జీవితం స్వార్థమే పంకిలం
జనహితం కాంక్షించు వేదం -
(సేవ చేయాలంది వేదం)
జ్ఞానఖడ్గందాల్చి చీకట్లనేకూల్చి
సత్యపథం చూపు వేదం
స్పష్టీకరించింది వేదం
సరస్వతీ వాక్కుతొ జ్ఞానధారలు పొంగె,
మదిలోన సద్గుణం వేదం
నిష్ఠతొ నిలుపుమన్నది వేదం ॥
సోమరసఆనందమంతరంగం తడిపి
సత్యమే సుఖమంది వేదం
చూపి నడిపింది వేదం
గుహలోని గోవులె సుజ్ఞాన కిరణమై ,
వెలుగులే ప్రసరించు వేదం
(ప్రసరించు వేదం)
అశ్వాలు శక్తులై సత్కార్యబలంతొ సాగిపొమ్మన్నది వేదం,
వేగంతో సాగిపొమ్మన్నది వేదం ॥
సూర్యప్రచండాగ్ని -లోలోన జ్వలియించె
అసత్య ఛేదనం వేదం
భ్రమలు ఛేదించమన్నది వేదం
సత్యచైతన్యంతొ ఆలోచనే చేసి
ఆచరించాలంది వేదం
సత్కర్మ ఆచరించాలంది వేదం
లోలోని దైవమే వాక్యమై మేల్కొనగ
మనిషి ప్రేరణపొందు వేదం
అంతర్యాత్రయే వేదం
No comments