ఉద్ధరించు ఈ జగతిని జయ దుర్గామాతా - Durga Devi Songs in Telugu
రచన - అప్పాల ప్రసాద్
ఉద్ధరించు ఈ జగతిని జయ దుర్గామాతా
రక్షించుము నీ భక్తుల జయజయహో మాతా
నీ చరణమె శరణాగతి - ఆదుకొనుము తల్లీ
శుభ మంగళ కరుణామయి రక్షించుము తల్లీ
జగత్తంత వ్యాపించిన విశ్వరూపివమ్మా
ఈ లోకం నమస్సులతో శిరసువంచెనమ్మా
ఉద్ధరించు ఈ జగతిని జయ దుర్గామాతా
రక్షించుము నీ భక్తుల జయజయహో మాతా
సమస్తజగతికి మూలం ఊహకందని నీ రూపం
మహాయోగుల అనుభవాలకందిన జ్ఞానం
నిత్యానంద రూపం మాటి మాటికి వందనము
అంతరంగజీవనమ్మే సుఖమయ ఆనందము
ఉద్ధరించు ఈ జగతిని జయ దుర్గామాతా
రక్షించుము నీ భక్తుల జయజయహో మాతా
బంధనం,భయవిముక్తం దుఃఖపీడనివారణం
నిస్సహాయులనాథలను సేవించిన దైవత్వం
కష్టాలకడలిని దాటించి అమ్మఒడిలో ఆశ్రయం
అజ్ఞాన చీకట్లు బాపి ప్రసాదించుము వివేకం
ఉద్ధరించు ఈ జగతిని జయ దుర్గామాతా
రక్షించుము నీ భక్తుల జయజయహో మాతా
దట్టమైన అడవులందు భీకరమౌ యుద్దమందు
జలం అగ్ని ప్రమాదాల్లో,శత్రు,రాజకీయాల్లో
సంక్షోభం సమయాల్లో అనుక్షణం రక్షించి
మనోధైర్య,మనో స్థైర్య విశ్వాసం కలిగించు
ఉద్ధరించు ఈ జగతిని జయ దుర్గామాతా
రక్షించుము నీ భక్తుల జయజయహో మాతా
అంతులేనిలోతు వున్న సముద్రజలాల మునిగె
దిక్కులేని వారికి నీవే దిక్కని చేయందించి లేపే
సుఖతీరం చేర్చు పడవ నీవేనని నే కొలిచితి
ఆపదలు కలుగువేళ నోరారా నే పిలిచితి
ఉద్ధరించు ఈ జగతిని జయ దుర్గామాతా
రక్షించుము నీ భక్తుల జయజయహో మాతా
No comments