Breaking News

మానవజాతికి మనుగడ కుటుంబమే ప్రేరణా - Kutumbam Song Lyrics in Telugu

రచన - అప్పాల ప్రసాద్


మానవజాతికి మనుగడ - 

కుటుంబమే ప్రేరణా

ప్రేమ, మమత భావనా

విలువల బాంధవ్యమా - ఏకాత్మత బంధమా


సపరివార సమేతంగ 

కట్టుగ ఉండాలని

గట్టిగ ఉండాలని

సంస్కారాలిచ్చి నామకరణం అందించిరి

కలగలిపి జీవించిరి 


మానవజాతికి మనుగడ - కుటుంబమే ప్రేరణా

ప్రేమ, మమత భావనా

విలువల బాంధవ్యమా - ఏకాత్మత బంధమా


అక్క,బావ, అన్న, వదిన, 

తాత,అవ్వ, మామలు

పల్లె వావివరుసలు

తులసి,గోవు ,గంగమాత,

 చందమామ బంధము

ప్రకృతే కుటుంబము


మానవజాతికి మనుగడ - కుటుంబమే ప్రేరణా

ప్రేమ, మమత భావనా

విలువల బాంధవ్యమా - ఏకాత్మత బంధమా


పండుగ పబ్బాలలో ,

వివాహా విందులలొ

అందమె ఆనందము

అమ్మ నాన్న ఆచార్యులు

 దైవ స్వరూపము 

గురు తర గౌరవము 


మానవజాతికి మనుగడ - 

కుటుంబమే ప్రేరణా

ప్రేమ, మమత భావనా

విలువల బాంధవ్యమా -

 ఏకాత్మత బంధమా


విద్య,అన్న, ఔషధాలు 

పంచే ఈ సంస్కృతి

మన తల్లి భారతి

కర్మ ఫలం,పునర్జన్మ 

అమరమైన సంతతి

ఆధ్యాత్మిక ఉన్నతి


మానవజాతికి మనుగడ - 

కుటుంబమే ప్రేరణా

ప్రేమ, మమత భావనా

విలువల బాంధవ్యమా -

 ఏకాత్మత బంధమా


ఉన్నత హిమవంతం - 

గంభీరం జలపాతం

మధ్య మహాభారతం

ఆసేతు హిమాచలం 

బంధువులందరమూ 

కుటుంబమే సారథ్యం


మానవజాతికి మనుగడ -

 కుటుంబమే ప్రేరణా

ప్రేమ, మమత భావనా

విలువల బాంధవ్యమా -

 ఏకాత్మత బంధమా

No comments