తబలా డోలు మ్రోగిస్తూ - Kesava Namala Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
తబలా డోలు మ్రోగిస్తూ -హార్మోనియం వాయిస్తూ
భక్తి శ్రద్దలు కురిపిస్తూ - నామం జపించరా
తాళం,చప్పట్ల శబ్దంతో - భగవంతుణ్ణి కీర్తిస్తూ
భక్తితో భజనలు సాగిస్తూ - నామం జపించరా
కేశవ అంటే క్లేశంలేని సుఖజీవనమిచ్చేను
నారాయణంటే నాశంలేని ఆత్మజ్యోతి వెలిగేను
మాధవ,గోవిందా - విష్ణు,మధుసూధన
త్రివిక్రమ, వామనా - శ్రీధర హృషికేశా
తబలా డోలు మ్రోగిస్తూ -హార్మోనియం వాయిస్తూ
భక్తి శ్రద్దలు కురిపిస్తూ - నామం జపించరా
తాళం,చప్పట్ల శబ్దంతో - భగవంతుణ్ణి కీర్తిస్తూ
భక్తితో భజనలు సాగిస్తూ - నామం జపించరా
పద్మనాభుని తలవంగానే - కమలం వికసించేను
దామోదరయని పిల్వంగానే - దరిద్రమే తొలిగేను
సంకర్షణ,వాసుదేవ -ప్రద్యుమ్న,అనిరుద్ద
అధోక్షజ,పురుషోత్తమ - నరసింహా,అచ్యుత
తబలా డోలు మ్రోగిస్తూ -హార్మోనియం వాయిస్తూ
భక్తి శ్రద్దలు కురిపిస్తూ - నామం జపించరా
తాళం,చప్పట్ల శబ్దంతో - భగవంతుణ్ణి కీర్తిస్తూ
భక్తితో భజనలు సాగిస్తూ - నామం జపించరా
జనార్ధనంటే భక్తుల బ్రోచి - జనాల రక్షించేను
హరి,శ్రీ కృష్ణా నామం చెప్తే - అహంకారమణిచేను
కేశవ నామాలూ - కలియుగ దైవాలూ
ముక్తిని కలిగించే - వర ప్రసాదాలు

No comments